Ram Charan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ RRR సినిమాతో గ్లోబల్ స్టార్ గా మారిపోయిన సంగతి తెలిసిందే. చిరంజీవి వారసుడిగా ఎంట్రీ ఇచ్చి తండ్రికి తగ్గ తనయుడిగా సినిమా రంగంలో రికార్డులు క్రియేట్ చేస్తూ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ వసూలు చేస్తూ అందరిని ఔరా అనిపిస్తున్నారు. బ్యాక్ టు బ్యాక్ విజయాలు అందుకుని మెగా అభిమానులను కాలర్ ఎగరేసేలా సినిమాలు చేస్తున్నారు. అదేవిధంగా ఎన్ని విజయాలు వచ్చినా గాని పొంగిపోకుండా గర్వానికి లోనవ్వకుండా తోటి హీరోలను చరణ్ ఎంతో గౌరవిస్తూ ఉంటారు. RRR సినిమా చేస్తున్న సమయంలో తారక్ తో చరణ్ కి మంచి ఫ్రెండ్ షిప్ ఏర్పడటం తెలిసిందే. అయితే RRR సినిమా చేస్తున్న సమయంలో… నందమూరి అభిమానులకు కూడా దగ్గర అవడం జరిగింది.
అంతకుముందు నందమూరి వర్సెస్ మెగా ఫ్యాన్స్ అన్న వార్ ఉండేది. RRR సినిమాతో ఈ ఫ్యాన్ వార్ చాలా వరకు చల్లబడింది. పరిస్థితి ఇలా ఉంటే తాజాగా నందమూరి తారక రామారావు శత జయంతి వేడుకలు చాలా ఘనంగా నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో శనివారం హైదరాబాద్ లో నిర్వహించిన ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల్లో రామ్ చరణ్ పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా చరణ్ మాట్లాడుతూ ఇచ్చిన స్పీచ్ నందమూరి ఫ్యాన్స్ నీ ఎంతగానో ఆకట్టుకుంది. “తెలుగు ఇండస్ట్రీ బతికున్నంత వరకు ఎన్టీఆర్ పేరు కీర్తించబడుతుంటది. ఇప్పుడు దేశంలో తెలుగు ఇండస్ట్రీ గురించి ముఖ్యంగా సౌత్ ఫిలిం ఇండస్ట్రీలో టాలీవుడ్ గురించి చాలా గొప్పగా మాట్లాడుతున్నారు.
అసలు తెలుగు ఇండస్ట్రీకి గుర్తింపు రావడానికి ప్రధాన కారణం ఎన్టీఆర్. అటువంటి వ్యక్తి కార్యక్రమానికి అని పిలిచినందుకు ధన్యవాదాలు. ఎన్టీఆర్ అనే వ్యక్తి గురించి తర్వాత తరానికి తెలిసేలా ఈ కార్యక్రమాన్ని చాలా ఘనంగా నిర్వహిస్తున్న మా చంద్రబాబు మరియు బాలకృష్ణ గారికి చాలా ధన్యవాదాలు. ముఖ్యంగా బాలకృష్ణ గారు మా ప్రతి కార్యక్రమానికి వస్తుంటారు.. అంటూ చరణ్ ఇచ్చిన స్పీచ్ కి నందమూరి ఫ్యాన్స్ పొంగిపోయారు. చెర్రీకి అసలు గర్వం లేదని డౌన్ టు ఎర్త్ అని.. అందరి మనసులను గెలుచుకున్నాడని.. ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల్లో మాట్లాడిన తీరుపై కామెంట్లు చేస్తున్నారు.