కళ్యాణ్ రామ్ కొత్తగా ఉన్నాడు

https://www.youtube.com/watch?v=KypNI5ug4vk

నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా ప్రముఖ సినిమాటోగ్రాఫర్ కెవి గుహన్ దర్శకత్వం వహించిన 118 ట్రైలర్ విడుదలైంది. కొత్తగా ట్రై చేసిన ఈ క్రైమ్ థ్రిల్లర్ ట్రైలర్ లో మంచి ఇంటెన్సిటీ ఉంది. అనవసరమైన అంశాలకు చోటు ఇవ్వకుండా కెవి గుహన్ చెప్పాలనుకున్న పాయింట్ కు కట్టుబడినట్టుగా కనిపిస్తోంది. స్వతహాగా సీనియర్ కెమెరామెన్ కావడంతో స్క్రీన్ పైన విజువల్ చాలా హై స్టాండర్డ్స్ ఉంది. శేఖర్ చంద్ర ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ రూపంలో బాగా ఎలివేట్ చేసింది. మార్చ్ 1న విడుదల కానున్న 118 ద్వారా నందమూరి ఫ్యాన్స్ కి కళ్యాణ్ రామ్ ఏదో కొత్త అనుభూతిని ఇచ్చేలా ఉన్నాడు. ఆసక్తి రేపెలా ఉన్న 118 చిక్కుముడి వీడాలి అంటే ఇంకో రెండు వారాలు వెయిట్ చేయక తప్పదు.