Manchu Lakshmi: కలెక్షన్ కింగ్ మోహన్ బాబు కుమార్తె, నటి, నిర్మాత మంచు లక్ష్మీ గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. 2011లో వచ్చిన `అనగనగా ఓ ధీరుడు` సినిమాలో ప్రతినాయిక పాత్రను పోషించి టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన మంచు లక్ష్మి.. తొలి మూవీతోనే నంది పురస్కారము, ఉత్తమ ప్రతినాయిక అవార్డులను అందుకుంది.
ఆ తర్వాత విభిన్నమైన పాత్రలను ఎంచుకుంటూ వరుస సినిమాలు చేసిన మంచు లక్ష్మి.. నటిగా మంచి మార్కులు వేయించుకుంది. ప్రస్తుతం ఈమె `నిద్ర లేచింది మహిళా లోకం` అనే సినిమా చేస్తోంది. అలాగే మోహన్ బాబుతో కలిసి ఇటీవల ఓ సినిమాను ప్రారంభించింది. మలయాళ, తమిళ్ భాషల్లోనూ ఒకట్రెండు చిత్రాల్లో కీలక పాత్రలను పోషిస్తోంది.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
ఇకపోతే తన మాటతీరుతోనే ఫుల్ ఫేమస్ అయిన మంచు లక్ష్మి.. సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్గా ఉంటుందో తెలిసిందే. అయితే ఈమె చేసినా, ఏ ఫొటో పెట్టిన నెటిజన్లు ఆమెపై విమర్శల అస్త్రాలు సంధిస్తూనే ఉంటారు. తాజాగా మంచు లక్ష్మి మరోసారి అడ్డంగా బుక్కైంది. అసలేమైందంటే.. మంచు లక్ష్మి తన షూ కలెక్షన్స్ కి సంబంధించిన ఫొటోను ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసింది.
తన ముందు ఐదారు జతల షూలను వేసి బుగ్గ మూతి పెట్టుకని ఫొటోకి ఫోజ్ ఇచ్చింది. ఈ ఫొటోను సైతం ఇన్స్టాలో షేర్ చేసిన మంచు లక్ష్మి.. `ఎప్పుడూ సరైన షూ దొరకదు` అంటూ క్యాప్షన్ ఇచ్చింది. ఇంకేముంది.. నెటిజన్లు చెప్పుల షాప్ పెట్టుకో, షూ స్మగ్లర్, కాలే కాళ్ళు ఒకచోట. లెక్క లేనన్ని జోల్లు ఒక చోట, షో ఆఫ్ చేసింది చాల్లే అంటూ ఆమెపై రకరకాలగా కామెంట్స్ చేస్తూ ట్రోల్ చేస్తున్నారు.
https://www.instagram.com/p/CeGg9VGK7f_/?utm_source=ig_web_copy_link
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!