NTR: యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఖాతాలో తాజాగా ఎవరూ ఊహించని నయా రికార్డ్ వచ్చి పడింది. పూర్తి వివరాల్లోకి.. మూడేళ్ల తర్వాత మళ్లీ ఈయన `ఆర్ఆర్ఆర్` సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిన ఈ భారీ మల్టీస్టారర్ మూవీలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరో హీరోగా నటించాడు.
భారీ బడ్జెట్‌తో ఫిక్షన్ స్టోరీగా రూపొందిన ఈ చిత్రం అనేక అడ్డంకులను దాటుకుని ఎట్టకేలకు నిన్న ప్రపంచవ్యాప్తంగా వివిధ భాషల్లో విడుదల అయింది. తొలి రోజే సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకున్న ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లను రాబడుతూ ప్రభంజనం సృష్టిస్తోంది. ఇక ఆర్ఆర్ఆర్ మంచి విజయం సాధించడంతో.. ఎన్టీఆర్ డబల్ హ్యాట్రిక్ హిట్స్ అందుకున్న హీరోగా రికార్డు క్రియేట్ చేశాడు.
బాద్షా, రామయ్యా వస్తావయ్యా, రభస వంటి ఫ్లాప్ చిత్రాలతో తర్వాత ఎన్టీఆర్ నుంచి వచ్చిన మూవీ `టెంపర్`. పూరీ జగన్నాథ్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా 2015లో విడుదలై బ్లాక్ బస్టర్‌గా హిట్‌గా నిలిచింది. ఆ తర్వాత 2016లో వచ్చిన నాన్నకు ప్రేమతో.. జనతా గ్యారేజ్, 2017లో రిలీజైన జై లవకుశ, 2018లో వచ్చిన అరవింద సమేత వీర రాఘవ చిత్రాలు వరసగా హిట్ అయ్యాయి.
ఇక ఇప్పుడు ఆర్ఆర్ఆర్ సైతం విజయం సాధించడంతో.. ఎన్టీఆర్ డబుల్ హ్యాట్రిక్ హిట్ మూవీస్‌ను ఖాతాలో వేసుకుని సరికొత్త రికార్డు సాధించాడు. ఇప్పుడున్న స్టార్ హీరోలకు సాధ్యం కానీ ఈ క్రెడిట్‌ను ఎన్టీఆర్ సొంతం చేసుకోవడంతో.. నందమూరి అభిమానులు ఆనందంతో ఉబ్బితబ్బిపోతున్నారు. కాగా, ఎన్టీఆర్ తన తదుపరి చిత్రాన్ని కొరటాల శివతో ప్రకటించిన విషయం తెలిసిందే. త్వరలోనే ఈ మూవీ సెట్స్ మీదకు వెళ్లనుంది.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!