NTR: యంగ్ టైగర్ ఎన్టీఆర్ తొలిసారి రామ్ చరణ్‌తో కలిసి చేసిన చిత్రం `ఆర్ఆర్ఆర్`. ఈ బిగ్గెస్ట్ మల్టీస్టారర్ మూవీని దర్శకధీరుడు రాజమౌళి రూపొందించగా.. డీవీవీ దానయ్య నిర్మించారు. ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలు ఉన్న ఈ మూవీ.. అనేక అడ్డంకులను దాటుకుని మార్చి 25న విడుదల కాబోతోంది.
రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో మేకర్స్ జోరుగా ప్రమోషన్స్ నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగానే డైరెక్టర్ అనిల్ రావిపూడి చేత స్పెషల్ ఇంటర్వ్యూ ఏర్పాటు చేయగా.. రాజమౌళితో పాటు తారక్, చరణ్‌లు సైతం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్.. రామ్ చరణ్‌తో తనకున్న అనుబంధం గురించి చెబుతూ ఓ టాక్ సీక్రెట్‌ను బయటపెట్టారు.
ఆయన మాట్లాడుతూ.. `మేమిద్దం చాలా మంచి ఫ్రెండ్స్. పక్కన అగ్ని పర్వం బద్దలవుతున్నా చరణ్ ఎలాంటి టెన్షన్ లేకుండా కామ్ గా వుంటాడు. కానీ, నేను అందుకు పూర్తిగా భిన్నం. నేను ఏదీ మనసులో దాచుకోలేను. భిన్న దృవాలు ఆకర్షిస్తాయి అంటారు కదా.. అలా చరణ్, నేను. కలిసిపోయాం.` అంటూ తారక్ చెప్పుకొచ్చాడు. ఈ సందర్భంగా మరో విషయాన్ని సైతం ఆయన తెలియజేశాడు.
`మార్చి 26న నా భార్య లక్ష్మీప్రణతి బర్త్‌డే. మార్చి 27న చరణ్ బర్త్‌డే. మా ఇద్దరి ఇళ్లు ఒకే చోట ఉంటాయి. ఎవరికీ తెలియని విషయమేంటంటే.. 26వ తేదీ అర్ధరాత్రి 12 గంటలయ్యిందంటే చాలు నేను గేటు దగ్గర ఉండేవాడిని, చరణ్ కారులో మా ఇంటి ముందు ఉండేవాడు. ఇద్దరం వెళ్లిపోయేవాళ్లం. ప్రణతి ఫోన్ చేస్తుంది. చరణ్ దగ్గర ఉన్నాను అని చెబుతాను. అదేంటి నా బర్త్ డే కదా? అని ప్రణతి అంటుంది. అది నిన్ననే అయిపోయిందిగా.. ఇప్పుడు పన్నెండు దాటింది డేట్ మారింది అని చెబుతుంటాను. అలా ఎన్నో ఏళ్లుగా రామ్ చరణ్ బర్త్ డేను సెలెబ్రేట్ చేస్తున్నాను.` అంటూ ఎన్టీఆర్ తెలిపాడు. దాంతో ఇప్పుడీయన కామెంట్స్ నెట్టింట వైరల్‌గా మారాయి.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!