SVP: “గీత గోవిందం” డైరెక్టర్ పరుశురాం దర్శకత్వంలో మహేష్ బాబు నటిస్తున్న సర్కారు వారి పాట సినిమా వేసవి కానుకగా మే 12వ తారీకు రిలీజ్ కానుంది ఉంది. సినిమాలో మహేష్ ఫుల్ మాస్ క్యారెక్టర్ చేసినట్లు ఇప్పటికే టాక్ బయట బలంగా వినపడుతోంది. మరోపక్క “సర్కారు వారి పాట” తన కెరీర్లో మరో పోకిరి అవుతుందని మహేష్ కామెంట్ చేయటం సినిమాపై అంచనాలు పెంచేసింది. ఇటువంటి తరుణంలో తమన్ కొద్ది రోజుల క్రితం విడుదల చేసిన ఫస్ట్ సింగిల్ “కళావతి” సాంగ్… సోషల్ మీడియాలో తిరుగులేని రికార్డులు సృష్టించడం తెలిసిందే.
రొమాంటిక్ మెలోడీ తరహాలో తమను అందించిన “కళావతి” సాంగ్ మ్యూజిక్…కి మహేష్ బాబు మరియు కీర్తిసురేష్ వేసిన స్టెప్పులు కి అదరగొట్టే రెస్పాన్స్ వచ్చింది. దాదాపు 100 మిలియన్ మార్క్ టచ్ చేసే దిశగా సోషల్ మీడియాలో ఆదరణ దక్కించుకుంటుంది. ఇదిలా ఉంటే ఇప్పుడు సెకండ్ సింగల్ వదలడానికి “సర్కారు వారి పాట” మేకర్స్ రెడీ అవుతున్నారు.
పరిస్థితి ఇలా ఉంటే సెకండ్ సింగిల్ కి సంబంధించి పాట ఎప్పుడు విడుదల అవుతుందో… ఏ సమయంలో సోషల్ మీడియాలో రిలీజ్ జరుగుతుందో పార్టీకి సంబంధించిన డీటెయిల్స్ మార్చి 17వ తారీకు ప్రకటిస్తామని.. తాజాగా సినిమా యూనిట్ అధికారిక ప్రకటన చేయడం జరిగింది. అందుతున్న సమాచారం ప్రకారం ఈ సాంగ్ మాస్ బిట్ అని అంటున్నారు. మైత్రి మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా లో మహేష్ ఫుల్ మాస్ క్యారెక్టర్ గా … అదరగొట్టే పంచ్ డైలాగులతో స్క్రీన్ మీద ఇరగ తీయనున్నట్లు సమాచారం.
Manasichi Choodu: మేము పెళ్లి కాకముందే అటువంటి పని చేశాము.. మనసిచ్చి చూడు సీరియల్ ఫేమ్ కీర్తి బోల్డ్ కామెంట్స్..!