సినిమా

Pawan Kalyan: మ‌న‌సు మార్చుకున్న ప‌వ‌న్‌.. ఆ డైరెక్ట‌ర్‌కు షాక్ త‌ప్ప‌దా?

Share

Pawan Kalyan: `వ‌కీల్ సాబ్‌`తో గ్రాండ్‌గా రీ ఎంట్రీ ఇచ్చిన ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. ప్ర‌స్తుతం వ‌రుస ప్రాజెక్ట్స్‌ను లైన్‌లో పెట్టిన సంగ‌తి తెలిసిందే. ఇటీవ‌లె `భీమ్లా నాయ‌క్‌`తో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించిన ఆయ‌న.. ఇప్పుడు క్రిష్ ద‌ర్శ‌క‌త్వంలో `హ‌రి హ‌ర వీర‌మ‌ల్లు` చేస్తున్నాడు. పీరియాడికల్‌ యాక్షన్ డ్రామాగా ఈ మూవీ రూపుదిద్దుకుంటోంది.

మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఎ.ఎం.రత్నం సమర్పణలో ఎ.దయాకర్ రావు నిర్మిస్తున్న ఈ చిత్రం త్వ‌ర‌లోనే ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ మూవీ పూర్తైన వెంట‌నే ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు హరీష్ శంకర్ తో `భవదీయుడు భగత్ సింగ్`ని పట్టాలెక్కించాలని ప‌వ‌న్ భావించారు. మెసేజ్ ఓరియంటెడ్ తరహాలో ఈ మూవీ ఉండ‌నుంద‌ని.. ఇందులో కాలేజీ లెక్చరర్ పాత్రలో పవన్ క‌నిపించ‌బోతున్నాడ‌ని వార్త‌లు వ‌చ్చాయి.

అలాగే ఇందులో పూజా హెగ్డే హీరోయిన్‌గా న‌టించ‌బోతోంద‌ని టాక్ న‌డిచింది. అయితే ఈ ప్రాజెక్ట్‌ను గ‌త ఏడాదే అనౌన్స్ చేసిన‌ప్ప‌టికీ.. సెట్స్ మీద‌కు మాత్రం వెళ్ల‌డం లేదు. హ‌రి హ‌ర వీర‌మ‌ల్లు అనంత‌రం ఖ‌చ్చితంగా ఈ మూవీ స్టార్ట్ అవుతుంద‌ని అనుకున్నారు. కానీ, తాజాగా ప‌వ‌న్ మ‌న‌సు మార్చుకున్నార‌ట‌.

భవదీయుడు భగత్ సింగ్ కంటే ముందే త‌మిళ్ సూప‌ర్ హిట్ `వినోదాయ సితం` తెలుగు రీమేక్‌ చేయాల‌ని నిర్ణ‌యించుకున్నార‌ట‌. ప్ర‌ముఖ న‌టుడు స‌ముద్రఖ‌ని ద‌ర్శ‌క‌త్వంలో ఈ చిత్రం తెర‌కెక్క‌బోతుండ‌గా.. మెగా మేన‌ల్లుడు సాయి ధ‌ర‌మ్ తేజ్ ఇందులో కీల‌క పాత్ర‌ను పోషించ‌నున్నాడు. ఇక మొద‌ట ఈ మూవీని ప‌ట్టాలెక్కించి.. ఆపై భవదీయుడు భగత్ సింగ్ చేయాల‌ని ప‌వ‌న్ భావిస్తున్నాడ‌ట‌. ఇదే నిజ‌మైతే ఎప్ప‌టి నుంచో ప‌వ‌న్ కోసం వెయిట్ చేస్తున్న హ‌రీష్ శంక‌ర్‌కు షాక్ త‌గిలిన‌ట్టే అవుతుంది.


Share

Related posts

F3 Movie: `ఎఫ్ 3` మూవీ టీమ్ కీల‌క నిర్ణ‌యం.. అదే నిజ‌మైతే ప్రేక్ష‌కుల‌కు పండ‌గే!

kavya N

కోరిక నేరవేరింది

Siva Prasad

Pawan Kalyan : ఓహో సూపర్ న్యూస్ : పవన్ కల్యాణ్ సొంత ఛానెల్ ?? మోడీ స్వయంగా సపోర్ట్ ఇస్తున్నాడు ?

sekhar