Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకపక్క సినిమాలు చేస్తూ మరోపక్క హీరోగా రాణిస్తున్న సంగతి తెలిసిందే. జనసేన పార్టీ లీడర్ గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు. ప్రజల తరపున ప్రభుత్వాన్ని నిలదీయడంలో ఎక్కడ వెనుకాడటం లేదు. 2019 ఎన్నికలలో ఎమ్మెల్యేగా పోటీ చేసి రెండు చోట్ల ఓడిపోయినా కానీ ప్రజా పోరాటంలో మాత్రం ఎక్కడా వెనకడుగు వేయకుండా పవన్ కళ్యాణ్ వ్యవహరిస్తున్న తీరు జనసేన పార్టీకి మంచి మైలేజ్ ఇస్తూ ఉంది. దీంతో కొన్ని సామాజిక వర్గాలతో పాటు యువత ఓటింగ్ ఎక్కువగా పవన్ ప్రభావితం చేస్తున్నారు.

ఇదిలా ఉంటే ఎన్నికలలో ఓడిపోయిన తర్వాత… కట్టె కాలే వరకు సినిమాల్లోకి వెళ్లే ప్రసక్తి లేదని పవన్ ప్రకటించడం జరిగింది. కానీ అభిమానుల నుండి వ్యతిరేకతరావడంతో సన్నిహితుల సినిమాలు చేయాలని కోరారు. దీంతో 2020లో “వకీల్ సాబ్” అనే సినిమా చేశారు. ఈ సినిమాలో కొత్తగా లాయర్ పాత్రలో పవన్ మెప్పించడం జరిగింది. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా రికార్డు కలెక్షన్స్ అప్పట్లో కొల్లగొట్టింది. పవన్ రీఎంట్రీ కి అభిమానుల నుండి.. మంచి స్పందన రావడం జరిగింది. ఇదిలా ఉంటే ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరుపుకుంటున్నారు.

ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ క్రిస్మస్ బహుమతులను డైరెక్టర్ వేణు శ్రీరామ్ కి పంపించడం జరిగింది. ఈ విషయాన్ని ఆయన సతీమణి సోషల్ మీడియా ద్వారా తెలియజేసింది. ఒక వేణు శ్రీరామ్ కి మాత్రమే కాదు తనతో పని చేసిన డైరెక్టర్స్ అందరికీ పవన్ క్రిస్మస్ గిఫ్ట్స్ పంపిస్తున్నారట. గత ఏడాది మహేష్ బాబు ఫ్యామిలీకి పవన్ ఈ క్రిస్మస్ గిఫ్ట్స్ పంపించడం జరిగింది. ప్రస్తుతం పవన్ … క్రిష్ దర్శకత్వంలో “హరిహర వీరమల్లు” చేస్తున్నాడు. ఈ సినిమా వచ్చే ఏడాది మార్చి నెలలో విడుదలకు సిద్ధంగా ఉంది. ఆ తరువాత హరీష్ శంకర్ దర్శకత్వంలో “ఉస్తాద్ భగత్ సింగ్” ప్రాజెక్ట్ స్టార్ట్ చేయనున్నారు.