పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ‘హరిహర వీరమల్లు’ సినిమా షూటింగ్‌లో ఫుల్ బిజీగా ఉంటున్నారు. ఈ సినిమా సెట్స్ పై ఉండగానే పవన్ తన నెక్స్ట్ ప్రాజెక్ట్ కు ఓకే చెప్పాడు. యువ డైరెక్టర్ సుజిత్ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నారు. పవన్ కళ్యాణ్‌ను ఒక రియల్ గ్యాంగ్‌స్టర్‌గా చూపిస్తానని చెప్పిన సుజిత్.. తన మూవీ అనౌన్స్ మెంట్ చేసినప్పటి నుంచి మెగా అభిమానుల దృష్టంతా ‘ది ఓజీ’పైనే ఉంది. ప్రముఖ నిర్మాత డీవీవీ దానయ్య ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్న ఈ సినిమా పూజా కార్యక్రమాలు ఈ రోజు (సోమవారం) జరగనున్నాయి.

పవన్‌కు వీరాభిమాని అయిన సుజిత్ ఈ సినిమా గురించి అధికారికంగా ప్రకటించినప్పటి నుంచే భారీ స్థాయిలో అంచనాలు పెరిగాయి. ఆ అంచనాలకు తగ్గట్లే ‘ది ఓజీ’ సినిమా ఉండబోతుందని చిత్ర యూనిట్ కాన్ఫిడెంట్‌గా చెబుతున్నారు. తాజాగా ఈ సినిమాకు సంగీతాన్ని సమకూర్చే అవకాశం తమన్ చేతికి వెళ్లిందని సమాచారం. ఈ మధ్య ఏ సినిమాలో చూసినా థమన్ మ్యూజికే వినిపిస్తోంది. తమన్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఇచ్చిన సినిమాలు ఈ మధ్య మంచి హిట్ కొట్టాయి. బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌తో ఎలివేషన్స్ ఇస్తున్న తమన్‌కు మంచి క్రేజ్ నడుస్తోంది.

ఇప్పటికే తమన్.. పవన్ కళ్యాణ్ సినిమాలైన ‘భీమ్లా నాయక్, వకీల్ సాబ్’ సినిమాలకు మ్యూజిక్ అందించాడు. ఈ రెండు సినిమాల్లో తమన్ అందించిన బీజీఎం పవన్ ఫ్యాన్స్ కు పూనకాలు తెప్పించాయి. అలాంటి సెన్సెషనల్ మ్యూజిక్ డైరెక్టర్ ఇప్పుడు పవన్‌తో ముచ్చటగా మూడోసారి సినిమా చేయబోతున్నాడు. ఈ సినిమాలోని పాటలు, మ్యూజిక్ సూపర్ హిట్ ఆల్బమ్ కావడం కన్‌ఫర్మ్ అని పవన్ ఫ్యాన్స్ చెబుతున్నారు. అయితే కొంతమంది అభిమానులు ఈ సినిమాకు అనిరుధ్ మ్యూజిక్ కంపోజ్ చేస్తే బాగుంటుందని అనుకుంటున్నారు. కానీ తమన్ మ్యూజిక్ డైరెక్టర్‌గా ఫైనల్ అయినప్పటి నుంచి సోషల్ మీడియాలో #FireStormlsComing అనే ట్యాగ్ ట్రెండింగ్‌గా నిలుస్తోంది.

అయితే సుజిత్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ చేయబోయే సినిమా గ్యాంగ్‌స్టర్ నేపథ్యంలో తెరకెక్కబోతున్నట్లు సమాచారం. ఈ సినిమాలో అస్సలు పాటలే ఉండవట. గంటన్నర నిడివితో ‘ఓజీ’ మూవీ తెరకెక్కించబోతున్నారు. బడ్జెట్‌కు వెనకాడకుండా ఈ సినిమాను తెరకెక్కించబోతున్నారని సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. తమన్ తన బీజీఎంతో థియేటర్లలో షేక్ చేస్తాడని పవన్ ఫ్యాన్ భావిస్తున్నారు. కాగా, రాజకీయాల్లో ఫుల్ బిజీగా ఉన్న పవన్.. వకీల్ సాబ్, భీమ్లా నాయక్ సినిమాతో మళ్లీ హిట్ కొట్టారు. వరుసగా సినిమాలు చేస్తున్నారు. ప్రస్తుతం ఆయన చేతిలో ‘హరిహర వీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాలు చేస్తున్నారు.

ఉస్తాద్ భగత్‌సింగ్‌లో అల్లు అర్హ సందడి
పవన్ కళ్యాణ్ హీరోగా డైరెక్టర్ హరీష్ తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఉస్తాద్ భగత్ సింగ్’. ఈ సినిమా కూడా సెట్స్ మీదికెళ్లింది. తమిళ మూవీ ‘తెరి’కి రీమేక్‌గా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. కానీ ఈ సినిమా కాన్సెప్ట్ మాత్రం తీసుకుని మిగిలిన సన్నివేశాలను తన వేలో మారుస్తున్నట్లు హరీష్ చెప్పుకొచ్చారు. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ లెక్చరర్ పాత్రలో కనిపిస్తాడట. అలాగే ఓ చిన్న పాప కూడా నటిస్తుందని సమాచారం. అల్లు అర్జున్ కుమార్తె అల్లు అర్హ ఉస్తాద్ భగత్‌సింగ్‌లో పవన్ కుమార్తెగా నటించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.