ప్రముఖ అమెరికన్ నటి అన్నీ వెర్షింగ్ ఆదివారం (జనవరి 29) రోజు మృతి చెందారు. రెండేళ్లుగా క్యాన్సర్‌తో పోరాటం చేస్తున్న ఆమె.. చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచినట్లు ఆమె భర్త స్టీఫెన్ ఫుల్ అధికారికంగా ప్రకటించారు. వెర్షింగ్‌కు 2020లో క్యాన్సర్ నిర్ధారణ అయింది. అప్పటి నుంచి ఆమె ఒక వైపు క్యాన్సర్‌తో పోరాటం చేస్తూనే.. మరో వైపు సినిమాలు, సిరీస్‌లలో నటించేవారు. క్యాన్సర్ తీవ్రత ఎక్కువ అవ్వడంతో ఆదివారం లాస్ ఏంజిల్స్ లో కన్నుమూశారు. ఆమె మరణంపై హాలీవుడ్ సెలబ్రిటీలు, అభిమానులు సోషల్ మీడియా వేదికగా సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

ఈ సందర్భంగా భర్త స్టీఫెన్ ఫుల్ మాట్లాడుతూ.. ‘మా కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మాతో ఎప్పుడు సంతోషంగా ఉంటూ.. అందరి జీవితాల్లో ఆనందాన్ని నింపే నా భార్య పరమపదించింది. తన నృత్యం, సంగీతంతో ఎప్పుడు సందడిగా ఉండే మా ఇళ్లు.. ఒక్కసారిగా మూగబోయింది. నన్ను, నా పిల్లలను ఒంటరి వాళ్లను చేసి వెళ్లిపోయింది. ఆమె కోసం మేము వెతకం. ఆమె అందరి గుండెల్లోనూ చిరస్థాయిగా నిలిచిపోయింది. మేము ఆమెను ఎంతగానో ప్రేమిస్తున్నాము. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని దేవుడిని ప్రార్థిస్తున్నాను.’ అని స్టీఫెన్ ఫుల్ సోషల్ మీడియాలో ప్రకటించారు.

అన్నీ వెర్షింగ్ వ్యక్తిగత విషయాలు
అమెరికా, మిస్సౌరీలోని సెయింట్ లూయిస్‌లో అన్నీ వెర్షింగ్ పుట్టి పెరిగారు. సెయింట్ లూయిస్ సెంట్రల్ వెస్ట్ ఎండ్‌లోని క్రాస్ రోడ్స్ కాలేజీ ప్రిపరేటరీ స్కూల్‌లో ఉన్నత పాఠశాలలో అభ్యసించింది. 1995లో గ్రాడ్యూయేట్ పూర్తి చేసుకుంది. మిల్లికిన్ విశ్వవిద్యాలయం నుంచి సంగీతంలో బ్యాచిలర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ డిగ్రీ అందుకుంది. 2009లో హాస్యనటుడు స్టీఫెన్ ఫుల్‌ను వివాహం చేసుకుంది. వీరికి ముగ్గురు కుమారులు ఉన్నారు.

సినీ కెరీర్ ప్రారంభం
అన్నీ వెర్షింగ్‌కు యాక్టింగ్, డ్యాన్సింగ్ మీద మక్కువ ఎక్కువ. అందుకే తన 24వ ఏటా ‘స్టార్ ట్రెక్: ఎంటర్‌ఫ్రైజ్’ అనే వెబ్‌సిరీర్‌లో అతిథి పాత్రలో కనిపించింది అన్నీ వెర్షింగ్. అలాగే ‘చార్బ్డ్, కిల్లర్ ఇన్‌స్టింక్ట్, సూపర్ న్యాచురల్, కోల్డ్ కేస్ వంటి షోల్లో గెస్ట్ రోల్ చేసింది. ఆమె యాక్టింగ్‌కు మంచి మార్కులే పడ్డాయి. వరుస ఆఫర్లతో సినిమాలు, సీరియల్స్, వెబ్ సిరీస్‌లలో నటించారు.

అన్నీ వెర్షింగ్ నటించిన సినిమాలు, షోలు
బ్రూస్ ఆల్మైటీ – సినిమా
బిలో ది బెల్ట్ వే – సినిమా
స్టార్ ట్రెక్: ఎంటర్‌ప్రైస్ – టెలివిజన్ ఎపిసోడ్
బర్డ్స్ ఆఫ్ ప్రే – టెలివిజన్ ఎపిసోడ్
ఎంజల్ – టెలివిజన్ ఎపిసోడ్
కిల్లర్ ఇన్‌స్టిక్ట్ – టెలివిజన్ ఎపిసోడ్
సూపర్ న్యాచురల్ – టెలివిజన్ ఎపిసోడ్
నో ఆర్డినరీ ఫ్యామిలీ – టెలివిజన్ ఎపిసోడ్
ఇంటెలిజెన్స్ – టెలివిజన్ ఎపిసోడ్
ది వ్యాంపైర్ డైరీస్ – టెలివిజన్ ఎపిసోడ్
టైంలెస్ – టెలివిజన్ ఎపిసోడ్
రన్ అవే – టెలివిజన్ ఎపిసోడ్
స్టార్ ట్రెక్: పికార్డ్ – టెలివిజన్ ఎపిసోడ్
వీడియో గేమ్స్:
ది లాస్ట్ ఆఫ్ అస్ – వాయిస్ అండ్ పర్ఫార్మెన్స్ కాప్చర్
అన్‌ధెమ్ (Anthem) – వాయిస్ అండ్ పర్ఫార్మెన్స్ కాప్చర్