సూపర్ స్టార్ మహేష్ బాబు ఎప్పుడు కూడా షర్ట్ లేకుండా కనిపించారు. సుకుమార్ దర్శకత్వంలో “వన్ నేనొక్కడినే” లో మాత్రమే షర్ట్ విప్పడం జరిగింది. అది కూడా కొద్దిపాటి షాట్ కోసం. ఇదిలా ఉంటే తాజాగా ఇంటిలో స్విమ్మింగ్ పూల్ లో షర్ట్ లేకుండా మహేష్ ఫోజులు ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా ఆ ఫోటోలు ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. దీంతో మహేష్ బాడీని ఫస్ట్ టైం చూస్తున్నామని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. చాలావరకు మహేష్ తన ఫోటోలు బయటకు రాకుండా చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు.
అయితే కొన్ని సందర్భాలలో కెమెరాలుకు మహేష్ చిక్కిన ఫోటోలు దొరికితే వాటిని అభిమానులు తెగ వైరల్ చేస్తూ ఉంటారు. ఈ క్రమంలో లేటెస్ట్ గా స్విమ్మింగ్ పూల్ లో ఏకంగా షర్ట్ లేకుండా మహేష్ బాడీ కనిపించడంతో అభిమానులు తెగ మురిసిపోతున్నారు. ప్రస్తుతం మహేష్ .. త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమా చేయడానికి రెడీ అవుతున్నారు. “SSMB 28” అనే వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది. అయితే షూటింగ్ స్టార్ట్ చేయకముందే ఏప్రిల్ 28వ తారీకు ఈ సినిమా రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషి గా ఉన్నారు.
అదే తారీకు 2006 వ సంవత్సరంలో మహేష్ నటించిన పోకిరి రిలీజ్ అయ్యి ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఇప్పుడు అదే తారీకు నాడు త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ నటిస్తున్న మూడో సినిమా వస్తుండటంతో… ఏ మాత్రం సెండ్ చేసిన సృష్టిస్తుందో అని SSMB 28 పై అభిమానులు రకరకాల డిస్కషన్ చేసుకుంటున్నారు. గతంలో త్రివిక్రమ్ దర్శకత్వంలో అతడు, ఖలేజా మహేష్ కెరియర్ ని మలుపు తిప్పే సినిమాలుగా నిలిచాయి. మరి వీరిద్దరి కలయికలో వస్తున్న మూడో సినిమా ఏ మాత్రం అలరిస్తుందో చూడాలి.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!