HBD Prabhas: నేడు ప్రభాస్ పుట్టినరోజు కావడంతో అభిమానులు ఫుల్ సంబరాలు చేసుకుంటున్నారు. మరి కొద్ది గంటల్లో ప్రభాస్ నటిస్తున్న సినిమాలకు సంబంధించి అప్ డేట్స్ కోసం ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సలార్ నుండి ఆశిస్తున్నారు. ఇక ఇదే సమయంలో “ప్రాజెక్టు కే” నుండి అప్ డేట్ ఇవ్వనున్నట్లు నిన్ననే డైరెక్టర్ నాగ్ అశ్విన్ తెలియజేయడం జరిగింది. ఇంకా “ఆది పురుష్” నుండి ఫస్ట్ సింగిల్ రిలీజ్ కానున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇదంతా పక్కన పెడితే 43వ ఏట అడుగుపెట్టిన ప్రభాస్ తన పుట్టినరోజు వేడుకలకు చాలా దూరంగా ఉన్నారట.
మేటర్ లోకి వెళ్తే ఈ ఏడాది సెప్టెంబర్ నెలలో పెదనాన్న కృష్ణంరాజు మరణించడంతో… ఈ బర్తడే వేడుకలను ప్రభాస్ జరుపుకోవడం లేదంట. కుటుంబం మొత్తం కృష్ణంరాజు మరణంతో విషాదంలో మునిగిపోవడంతో ప్రభాస్ ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందంట. ఈశ్వర్ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన ప్రభాస్ తన 20 ఏళ్ల నటి జీవితంలో ఎన్నో శిఖరాలు అధిరోహించారు. బాహుబలి సినిమాతో నేషనల్ వైడ్ ఇమేజ్ క్రియేట్ చేసుకోవడం జరిగింది. అంతేకాదు భారతీయ చలనచిత్ర రికార్డులను కూడా బ్రేక్ చేయడం జరిగింది.
పాన్ ఇండియా సూపర్ స్టార్ గా దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ప్రభాస్ ఇమేజ్ డబల్ త్రిబుల్ అయింది. దీంతో నేడు తమ అభిమాన హీరో పుట్టినరోజు కావడంతో ఫ్యాన్స్ ఫుల్ సంబరాలు చేసుకుంటున్నారు. ఇదిలా ఉంటే మరో పక్క ప్రభాస్ బర్తడే నేపథ్యంలో మెహర్ రమేష్ దర్శకత్వంలో ప్రభాస్ గతంలో నటించిన బిల్లా సినిమా 4K టెక్నాలజీతో స్పెషల్ షోలు వేస్తున్నారు. ఈ సినిమాలో కృష్ణంరాజు స్పెషల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించడంతో.. ఆయనను స్మరించుకుంటూ.. రెబల్ ఫ్యాన్స్ ప్రభాస్ పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారు.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!