యంగ్ సెన్సేషన్ విశ్వక్ సేన్ హీరోగా నటించిన తాజా చిత్రం `ఓరి దేవుడా`. అశ్వత్ మరిముత్తు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మిథిలా పాల్కర్ హీరోయిన్గా నటించింది. అలాగే విక్టరీ వెంకటేష్ గెస్ట్ రోల్ చేశారు. ప్రేమతో పాటు రొమాంటిక్ కామెడీ నేపథ్యంలో సాగే ఫాంటసీ మూవీ ఇది.
తమిళ సూపర్ హిట్ మూవీ `ఓ మై కడవులే`కు రీమేక్‌గా రూపుదిద్దుకున్న ఈ చిత్రం దీపావళి కానుకగా అక్టోబర్ 21న విడుదలైంది. ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ దక్కింది. ఈ సినిమాలో వెంకీ దేవుడిగా కనిస్తారు. దేవుడంటే కిరీటం, స్వర్గం వంటివి ఏమీ ఎక్స్పెక్ట్ చేయకండి.
చక్కగా సూటు, బూటు వేసుకుని మోడ్రన్ గాడ్‌గా వెంకీ తనదైన పర్ఫామెన్స్తో ప్రేక్షకులను అలరించాడు. ఉన్నది కాసేపే అయినా చక్కటి అభినయం ప్రదర్శించాడు. ఆయన ఈ సినిమాలో నటించడం వల్ల డబుల్ కాదు ట్రిపుల్ బజ్ ఏర్పడింది. అయితే ఈ సినిమాలో చేసింది గెస్ట్ రోలే అయినప్పటికీ వెంకీ మాత్రం భారీగానే ఛార్ట్ చేశాడని నెట్టింట ఓ న్యూస్ వైరల్‌గా మారింది.
దాని ప్రకారం.. ఈ చిత్రానికి అక్షరాల రూ.3 కోట్లు రెమ్యునరేషన్‌గా వెంకటేష్ పుచ్చుకున్నారట. ఈ సినిమా కోసం వెంకీ ఐదంటే ఐదు రోజులు మాత్రమే షూటింగ్ లో పాల్గొన్నారు. అయినాసరే ఆ రేంజ్లో రెమ్యునరేషన్ అందుకోవడం ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది.
https://newsorbit.com/entertainment-news/venkatesh-may-be-work-with-jathi-ratnalu-director.html