దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి `RRR`కి ఎన్ని హంగులను చేర్చాలో అన్నీ చేరుస్తున్నాడు. ఇప్పటికే ఎన్టీఆర్, రాంచరణ్ వంటి స్టార్ హీరోలు నటిస్తోన్న ఈ చిత్రంలో అజయ్ దేవగణ్, అలియా భట్ వంటి స్టార్స్ నటిస్తున్నారు. సినిమాలో అల్లూరి సీతారామరాజు పాత్రలో రాంచరణ్.. కొమరం భీమ్ పాత్రలో ఎన్టీఆర్ కనపడబోతున్నారు. ఈ రెండు పాత్రలకు సంబంధించిన ఫిక్షనల్ కథే `RRR`. ఈ పాత్రలను ప్రేక్షకులకు పరిచయం చేసే వాయిస్ ఓవర్‌ను ప్రభాస్ చెప్పబోతున్నాడని వార్తలు వినపడుతున్నాయి. ప్రభాస్ వాయిస్ ఓవర్ చెప్పడం సినిమాకు మరో ప్లస్ అవుతుందనడంలో సందేహం లేదు.
ప్రస్తుతం రాంచరణ్ కాలికి గాయం కావడంతో సినిమా మూడు వారాల పాటు ఆగి ఉంది. త్వరలోనే షెడ్యూల్ ప్రారంభం కానుంది.
previous post
next post