Prabhas: “బాహుబలి 2” వంటి భారీ బ్లాక్ బస్టర్ తర్వాత రాజమౌళి దర్శకత్వంలో “RRR” రావటం ఎన్నో సంచలనాలకు దారి తీసింది. “RRR” విడుదల కాకముందు సినిమాకి సంబంధించి అప్ డేట్స్ కోసం ఎంతగానో వెయిట్ చేసేవాళ్ళు. ఈ క్రమంలో కొన్ని వీడియోలు షూటింగ్ స్పాట్ లో… జరిగే సన్నివేశాలు లీక్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఎన్టీఆర్… కొమరం భీం పాత్రకి సంబంధించి… వీడియో అప్పట్లో లీక్ కావటం.. సోషల్ మీడియాలో సంచలనం సృష్టించింది.
దీంతో డైరెక్టర్ రాజమౌళి ముందు జాగ్రత్తగా షూటింగ్ జరిగే ప్రదేశాలలో పాల్గొనే వాళ్లు ఎవరూ కూడా సెల్ ఫోన్ లు వాడకూడదని తీసుకురాకూడదని కఠినమైన నిర్ణయం తీసుకోవడం జరిగింది. సరిగ్గా ఇప్పుడు ఇదే తరహాలో డైరెక్టర్ ప్రశాంత్ నీల్ నిర్ణయం తీసుకోవడం జరిగింది అంట. విషయంలోకి వెళ్తే ప్రభాస్ తో చేస్తున్న “సలార్” మూవీ షూటింగ్ కి సంబంధించి ఆన్ లైన్ లో ఫోటోలు లీక్ అయ్యాయి.
ఈ పరిణామంతో ప్రశాంత్ నీల్ సీరియస్ అయినట్లు ఇండస్ట్రీలో టాక్. దీంతో షూటింగ్ స్పాట్ లో పనిచేసే యాక్టర్స్.. టెక్నికల్ టీమ్ ఎవరు కూడా సెల్ ఫోన్ తీసుకురాకూడదని సరికొత్త ఆదేశాలు జారీ చేయడం జరిగిందట. క్యారీ వ్యాన్ లేదా లాకర్స్ లో పెట్టుకునే షూటింగ్ లో జాయిన్ అవ్వాలని..ప్రశాంత్ నీల్ సూచించారట. ఈ సినిమాలో ప్రభాస్ లుకే కీలకం కావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. “సలార్” వచ్చే ఏడాది సెప్టెంబర్ నెలలో విడుదల చేస్తున్నట్లు సినిమా యూనిట్ అధికారికంగా ప్రకటించింది. అయితే వచ్చే నెలలో ప్రభాస్ పుట్టిన రోజు కావడంతో సినిమాకి సంబంధించి.. వీడియో విడుదల చేసే ఆలోచనలో సినిమా యూనిట్ ఉన్నట్లు సమాచారం.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!