విక్టరీ వెంకటేష్ నటిస్తున్న తాజా చిత్రం నారప్ప. తమిళలో ధనుష్ నటించిన ‘అసురన్’ సినిమాని తెలుగులో ‘నారప్ప’ టైటిల్ తో అఫీషియల్ గా రీమేక్ చేస్తున్నారు. ‘ఎఫ్ 2’, ‘వెంకీమామ’ సినిమాలతో వరుస హిట్స్ అందుకున్న వెంకీ నారప్ప తో హ్యాట్రిక్ హిట్ కొట్టాలని చూస్తున్నాడు. తమిళ్లో అసురన్ 100 కోట్ల కి పైగా వసూళ్ళు సాధించి సంచలన విజయాన్ని అందుకుంది. ఇప్పుడు ఇదే సినిమాని వెంకటేష్ చేస్తుండటం తో భారీగా అంచనాలు నెలకొన్నాయి. అదీ కాక నారప్ప అంటూ టైటిల్ ని ఫిక్స్ చేసి వెంకటేష్ లుక్ రిలీజ్ చేసినప్పటి నుంచి ఆ అంచనాలు మరింత పెరిగాయి.
ఇప్పటికే కొంత భాగం టాకీ పార్ట్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా లాక్ డౌన్ మూలాన బ్రేక్ పడింది. ఇక కొత్త బంగారు లోకం, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు ‘బ్రహ్మోత్సవం’ వంటి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్స్ ని తెరకెక్కిచి దర్శకుడిగా తనకంటూ మంచి గుర్తింపు సంపాదించుకున్న శ్రీకాంత్ అడ్డాల ఈ రీమేక్‌కి దర్శకత్వం వహిస్తున్నాడు.
ఇక ఈ సినిమాతో చాలా కాలం తర్వాత జాతీయ అవార్డ్ గ్రహీత ప్రియమణి రీ ఎంట్రీ ఇస్తోంది. సెకండ్ ఇన్నింగ్స్ లో మంచి ఛాన్స్ అందుకుంది ప్రియమణి. ఈ సినిమాలో ప్రియమణి అద్భుతమైన పాత్రను పోషిస్తుంది. విలేజ్ బ్యాగ్డ్రాప్ లో తెరకెక్కిస్తున్న ఈ సినిమా నుండి తాజాగా చిత్ర బృందం ప్రియమణి పుట్టిన రోజు సందర్భంగా తన లుక్ ని రిలీజ్ చేశారు. ఈ లుక్ ద్వారానే నారప్ప టీం ప్రియమణి కి బర్త్ డే విషెస్ ని తెలిపారు. ఇక నారప్ప లో ప్రియమణి లుక్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది. అంతేకాదు ఈ లుక్ తో ప్రియమణి నారప్ప లుక్ నే డామినేట్ చేస్తుందన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!