Priyamani: కేరళలో పుట్టి పెరిగిన ప్రియమణి `ఎవరే అతగాడు?`తో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. ఈ సినిమా గురించి పెద్దగా ఎవరికీ తెలీకపోయినా.. ఆ తర్వాత జగపతిబాబుతో ఈమె చేసిన `పెళ్ళైనకొత్తలో` చిత్రం మంచి విజయం సాధించింది. ఈ మూవీతో గుర్తింపు దక్కించుకున్న ప్రియమణి.. ఆ వెంటనే `యమదొంగ`తో బ్లాక్ బస్టర్ హిట్‌ను ఖాతాలో వేసుకుంది.
ఈ మూవీ హిట్ అనంతరం ప్రియమణి వెనక్కి తిరిగి చూసుకోలేదు. వరుస ఆఫర్లను అందుకుంటూ టాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా గుర్తింపు సంపాదించుకుంది. ఇక పెళ్లి కారణంగా కొన్నాళ్లకు ఇండస్ట్రీకి దూరంగా ఉన్నా.. మళ్లీ సెకెండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి నటిగా దూసుకుపోతోంది.
ప్రస్తుతం ఈ భామ బుల్లితెర ఢీ షోకు జడ్జ్‌గా వ్యవహరిస్తూనే.. మరోవైపు తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో సినిమాలు, వెబ్ సిరీస్‌లు చేస్తూ బిజీ బిజీగా గడుపుతోంది. ఇకపోతే సోషల్ మీడియాలో సూపర్ యాక్టివ్‌గా ఉండే ప్రియమణి.. ఎప్పటికప్పుడు అదిరిపోయే ఫొటో షూట్లను కుర్రాళ్ళకు నిద్ర పట్టకుండా చేస్తుంటుంది.
తాజాగా కూడా గ్రీన్ కలర్ ట్రెండ్ డ్రస్ ధరించి థైస్ అందాలు ఎలివేట్ అయ్యేలా ఫొటోలకు పోజులిచ్చింది. ఆపై అందుకు సంబంధించిన పిక్స్‌ను సోషల్ మీడియాలో షేర్ చేయగా.. అవి కాస్త నెట్టింట వైరల్‌గా మారాయి.
ఈ పిక్స్‌ను చూసిన కుర్రాళ్ళు.. ప్రియమణి ఇది టూ మచ్, ఇంత అందంగా ఉన్నావేంటి అంటూ రకరాలక కామెంట్స్ చేస్తున్నారు. మరి ఇంకెందుకు లేటు ప్రియమణి తాజా పిక్స్‌పై మీరూ ఓ లుక్కేసేయండి.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!