Liger: డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన “లైగర్” అట్టర్ ఫ్లాప్ కావడం తెలిసిందే. ఫస్ట్ టైం పాన్ ఇండియా నేపథ్యంలో పూరి తెరకెక్కించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా పడింది. ఆగస్టు 25వ తారీకు రిలీజ్ అయి మొదటి రోజే అట్టర్ ఫ్లాప్ టాక్ సొంతం చేసుకుంది. దీంతో సినిమా కొన్న డిస్ట్రిబ్యూటర్లు చాలా నష్టపోయారు.ఈ పరిణామంతో హీరో విజయ్ దేవరకొండ ఇంకా డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తమ రెమ్యూన్నరేషన్ తగ్గించుకుని.. కొంత డబ్బులు వెనక్కి ఇచ్చేయడం జరిగింది.
ఇంత దారుణంగా అట్టర్ ఫ్లాప్ అయినా..”లైగర్” అనేక విమర్శలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచింది. వరుసపరాజయాలలో ఉన్న విజయ్ దేవరకొండకి అతి పెద్ద ఫ్లాప్ పూరి ఇచ్చాడని అభిమానులు మండిపడ్డారు. అసలు దర్శకుడు పూరి జగన్నాథ్ మార్క్ సినిమాలో ఎక్కడా కనిపించలేదని విమర్శలు చేయడం జరిగింది. కాగా ..”లైగర్” ఫ్లాప్ అయిన తరువాత చేసిన మొదటి పని గురించి ఇటీవల చిరంజీవితో జరిగిన ఇంటర్వ్యూలో పూరి జగన్నాథ్ బయటపెట్టారు. “గాడ్ ఫాదర్” విజయం సాధించడంతో చిరు..పూరి ఆన్ లైన్ లో మాట్లాడటం జరిగింది. ఈ క్రమంలో లైగర్ పరాజయం ఎలా తీసుకున్నావ్ పూరి అని చిరంజీవి ప్రశ్నించారు. దానికి పూరి సమాధానం ఇస్తూ…”సినిమా శుక్రవారం విడుదల అయింది ఆ తర్వాత ఫ్లాప్ టాక్ వచ్చింది. దీంతో వెంటనే.. నేను చేసిన మొదటి పని జిమ్ కి వెళ్లి 100 స్క్యాడ్స్ చేశా”.
సినిమా పోయిందని ఏడుస్తూ ఉండలేం కదా. వెంటనే నెక్స్ట్ ప్రాజెక్ట్ గురించి ఫోకస్ పెట్టాను అంటూ….”లైగర్” పరాజయం గురించి చిరుకి పూరి తెలియజేశారు. ఏదైనా నెల రోజులు బాధపడతాను. అంతకుమించి టైం ఎక్కువ తీసుకోను సార్ అంటూ పూరి తెలిపారు. ఇక ఇదే సమయంలో మంచి స్టోరీ ఉంటే చూడు.. ఇద్దరం కలిసి చేద్దాం నేను రెడీ గానే ఉన్నాను అంటూ చిరంజీవి.. పూరికి ఆఫర్ ఇవ్వటం జరిగింది. దీంతో పూరి జగన్నాథ్ కచ్చితంగా ఇద్దరం కలిసి చేద్దామన్నయ్య అని అన్నారు.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!