ఇటీవల వరల్డ్ బాడ్మింటర్ చాంపియన్‌షిప్‌ను కైవసం చేసుకున్న మన తెలుగు అమ్మాయి పి.వి.సింధుకి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ఆమె బయోపిక్‌ను రూపొందించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. నటుడు, నిర్మాత సోనూసూద్ ఈమె బయోపిక్‌ను రూపొందించడానికి ఎప్పటి నుండో ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో పి.వి.సింధు పాత్రలో సమంత నటిస్తుందనే వార్తలు కూడా వినిపించాయి. ఈ తరుణంలో రీసెంట్ ఇంటర్వ్యూలో సింధుని విలేకరులు ఆమె బయోపిక్ గురించి ప్రశ్నించారు. తన పాత్రలో దీపికా పదుకొనే నటిస్తే బావుంటుందనిపిస్తుందని చెప్పారు. అది తన వ్యక్తిగత అభిప్రాయమని కూడా చెప్పారు.
previous post
next post
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!