నాగచైతన్యతో `RX 100` డైరెక్టర్ అజయ్‌భూపతి సినిమా చేయాలనుకుంటున్నాడా? అంటే అవుననే సమాధానం ఇండస్ట్రీ వర్గాల నుండి వస్తుంది. అజయ్ తొలి సినిమాతో బారీ విజయాన్ని దక్కించుకున్నా.. తదుపరి సినిమాను తెరకెక్కించడానికి ఎక్కువగా శ్రమపడాల్సి వస్తుంది. నిజానికి అజయ్‌భూపతి తన రెండో చిత్రాన్ని రవితేజతో తెరకెక్కించడానికి రెఢీ అయ్యాడు. అంతా ఓకే అనుకుంటున్న సమయంలో రెమ్యునరేషన్ సమస్య కారణంగా రవితేజ ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నాడట. దీంతో సదరు దర్శకుడు ఈ కథను నాగచైతన్యకు వినిపించే ప్రయత్నాలు ముమ్మరం చేశాడు. చైతు ప్రస్తుతం స్పెయిన్‌లో ఉన్నాడు. అక్కడి నుండి రాగానే చైతుని అజయ్ భూపతి కలవబోతున్నాడనేది సమాచారం. మరి అజయ్‌భూపతి కథకు చైతు సిగ్నల్ ఇస్తాడేమో!
previous post
Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!