Rakul Preet Singh: రకుల్ ప్రిత్ సింగ్.. ఈ పంజాబీ భామ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. టాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా చక్రం తిప్పిన ఈ బ్యూటీ.. ఇప్పుడు బాలీవుడ్‌పై కన్నేసింది. ప్రస్తుతం రకుల్ తెలుగులో ఒక్క సినిమా కూడా చేయకపోయినా.. హిందీలో మాత్రం అరడజన్కు పైగా చిత్రాలు చేస్తూ అక్కడ మస్తు బిజీగా గడుపుతోంది.
కెరీర్ విషయం పక్కన పెడితే.. బాలీవుడ్ నటుడు, నిర్మాత జాకీ భగ్నానీతో రకుల్ ప్రేమాయణం నడిపిస్తున్న సంగతి తెలిసిందే. త్వరలోనే వీరిద్దరూ పెళ్లి పీటలు కూడా ఎక్కబోతున్నారు. అయితే రకుల్ తాజాగా ప్రియుడితో కలిసి మాల్టీవ్స్కి చెక్కేసింది.
ప్రస్తుతం అక్కడ ఈ భామ హాట్ డోస్ పెంచేసి గ్లామర్ షోతో రెచ్చిపోతోంది. అంతేకాదు, అందుకు సంబంధించిన పిక్స్‌ను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ సెగలు పుట్టిస్తోంది. తాజాగా బికినీ ధరించిన రకుల్.. జీరో సైజ్ అందాలతో హాట్ హాట్‌గా ఫొటోలకు పోజులిచ్చింది.
ఆపై అందుకు సంబంధించిన పిక్స్‌ను ఇన్‌స్టా ద్వారా షేర్ చేసింది. ఇక రకుల్ బికినీ ట్రీట్ చూస్తే ఎవ్వరైనా పిచ్చెక్కిపోతారు. అంతలా ఆమె తన అందాలతో రెచ్చగొడుతోంది. కాగా, సినిమాల విషయానికి వస్తే.. రకుల్ చేతిలో జగత్ జంత్రి, డాక్టర్ జి, థ్యాంక్ గాడ్, అయలాన్, రన్ వే 34, అటాక్ చిత్రాలు ఉన్నాయి.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!