న్యూస్ సినిమా

Keerthi suresh: మెగాస్టార్ మిస్ అయితే, మెగా పవర్ స్టార్ వస్తున్నాడు..కీర్తి చాలా లక్కీ

Share

Keerthi suresh: మెగాస్టార్ మిస్ అయితే, మెగా పవర్ స్టార్ వస్తున్నాడు..కీర్తి చాలా లక్కీ. ఇంతకంటే ప్రూఫ్ ఏం కావాలి..గుడ్ లక్ సఖి సినిమా బ్లాక్ బస్టర్ అవబోతుందని. జాతీయ అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ నగేష్ కుకునూర్ రూపొందిన చిత్రమిది. ప్రముఖ నిర్మాత దిల్ రాజు సమర్పిస్తుండగా, వర్త్ ఏ షాట్ మోషన్ ఆర్ట్స్ పతాకంపై సుధీర్ చంద్ర పదిరి ఈ సినిమాను నిర్మించారు. స్పోర్ట్స్ డ్రామా బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన ఈ మూవీ గత కొంత కాలంగా ఎప్పుడు రిలీజ్ అనుకున్నా వాయిదా పడుతూ వస్తోంది. ఎట్టకేలకి ఈ నెల 28వ తేదీన భారీ స్థాయిలో రిలీజ్ చేయబోతున్న మేకర్స్ ఇటీవల ప్రకటించారు.

ram charan is chief guest for good luck sakhi for pre release event
ram charan is chief guest for good luck sakhi for pre release event

ఇక ఈ సినిమాలో యంగ్ హీరో ఆది పినిశెట్టి, సీనియర్ నటుడు జగపతిబాబు, ప్రముఖ సీనియర్ నటి రమా ప్రభ, యంగ్ కమెడియన్ రాహుల్ రామకృష్ణ ఇతర కీలక పాత్రల్లో నటించారు. ఫీమేల్ సెంట్రిక్ మూవీగా రూపొందిన ఈ సినిమా మీద అంతగా అంచనాలు లేవని టాక్ వినిపిస్తోంది. అందుకు కారణం ఇదే ఫీమేల్ సెంట్రిక్ మూవీగా వచ్చిన కీర్తి సురేశ్ గత చిత్రాలు పెంగ్విన్, మిస్ ఇండియా సినిమాలు ఫ్లాప్‌గా మిగిలాయి. దాంతో కీర్తి నటించిన మరో లేడీ ఓరియెంటెడ్ సినిమా గుడ్ లక్ సఖి కూడా ఫ్లాప్ అయ్యే అవకాశాలున్నాయనే నెగిటివ్ టాక్ వినిపించింది. అయితే, తాజాగా దీనికి సంబంధించిన ఓ న్యూస్ నిజంగానే ఈ సినిమాకు లక్ లేదనే కామెంట్స్ వచ్చేలా చేసింది.

Keerthi suresh: గుడ్ లక్ సఖి చిత్రానికి బ్యాడ్ లక్ అంటూ ప్రచారం.

అదే మెగాస్టార్ చిరంజీవి ఈ సినిమా గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు హాజరవలేకపోవడం. సరిగ్గా రెండ్రోజులు ముందు అంటే జనవరి 26న భారీ స్థాయిలో ప్రీ రిలీజ్ ప్లాన్ చేసిన మేకర్స్ ముఖ్య అతిథిగా మెగాస్టార్ చిరంజీవిని ఆహ్వానించారు. దాంతో సినిమాపై బాగానే హైప్ క్రియేటయింది. కానీ, తాజాగా చిరంజీవికి కరోనా సోకింది. దాంతో ఆయన సెల్ఫ్‌గా హోం క్వారంటైన్‌లోకి వెళ్ళిపోయారు. ఈ నేపథ్యంలో గుడ్ లక్ సఖి చిత్రానికి బ్యాడ్ లక్ అంటూ ప్రచారం చేస్తున్నారు. దీనికి చెక్ పెడుతూ ఈ సినిమా గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు మెగాస్టార్‌కి బదులుగా ఆయన కొడుకు స్టార్ హీరో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హాజరవుతున్నారు. దాంతో చిరు మిస్ అయినా చరణ్ వచ్చి సఖి విషెస్ చెప్పబోతున్నాడని గ్యారెంటీగా ఈ సినిమా భారీ హిట్ సాధిస్తుందని చెప్పుకుంటున్నారు.


Share

Related posts

రికార్డుల కోసం సైరా చేయ‌లేదు : చ‌ర‌ణ్‌

Siva Prasad

జ‌గ‌న్ స‌ర్కారుపై చిన్న‌మ్మ క‌న్నెర్ర‌….

sridhar

బాలీవుడ్ అరుంధతి గా కూడా ఆ స్టార్ హీరోయిన్ ఫిక్స్ అయిందా ..?

GRK
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar