సినిమా

Ramarao On Duty: `రామారావు ఆన్ డ్యూటీ` టీజర్ అదిరింది అంతే..!

Share

Ramarao On Duty: మాస్ మ‌హారాజ్ ర‌వితేజ ప్ర‌స్తుతం చేస్తున్న చిత్రాల్లో `రామారావు ఆన్ డ్యూటీ` ఒక‌టి. శరత్ మండవ దర్శక‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రంలో దివ్యాంక కౌశిక్, ర‌జిష విజయన్‌లు హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. సీనియ‌ర్ స్టార్ వేణు తొట్టెంపూడి కీల‌క పాత్ర‌ను పోషిస్తున్నారు. ఎస్ఎల్‌వీ సినిమాస్‌, ఆర్‌టీ టీమ్ వ‌ర్క్స్ బ్యాన‌ర్ల‌పై సుధాకర్‌ చేకూరి నిర్మిస్తున్న ఈ చిత్రంలో ర‌వితేజ పవర్ ఫుల్ డిప్యూటీ కలెక్టర్ పాత్రలో కనిపించనున్నారు.

ఇటీవ‌లె షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వ‌ర‌లోనే విడుద‌ల కానుంది. అయితే నేడు మ‌హా శివ‌రాత్రి సంద‌ర్భంగా మేక‌ర్స్ తాజాగా `రామారావు ఆన్ డ్యూటీ` టీజర్‌ను విడుద‌ల చేశారు. యాక్ష‌న్ స‌న్నివేశాల‌తో మొద‌లైన ఈ టీజ‌ర్ ఆద్యంతం ఆక‌ట్టుకుంది. డిప్యూటీ కలెక్టర్‌గా ఓవైపు పేద‌ల‌కు హెల్ప్ చేయ‌డ‌మే కాదు.. మ‌రోవైపు క్రిమినల్స్ తాట తీస్తూ ఎంతో ప‌వ‌ర్ ఫుల్‌గా ర‌వితేజ క‌నిపించారు.

`ఆయుధం మీద ఆధారపడే నీలాంటి వాడి ధైర్యం వాడే ఆయుధంలో వుంటుంది… ఆయుధంలా బ్రితికే నాలాంటి వాడి ధైర్యం అణువణువునా ఉంటుంది`.. `క్రిమినల్స్ విల్ బి పనిష్డ్ … నో మ్యాటర్ వార్న్… ఈవెందో దెరీజ్ నో ఎవిడెన్స్` అంటూ ర‌వితేజ చెప్పే డైలాగ్స్ టీజ‌ర్‌కి హైలైట్‌గా నిలిచాయి.

బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌, యాక్ష‌న్ స‌న్నివేశాలు, విజువ‌ల్స్ వంటి అంశాలు కూడా అద్భుతంగా ఉన్నాయి. మొత్తానికి అదిరిపోయిన తాజా టీజ‌ర్ సినిమాపై భారీ అంచ‌నాల‌ను క్రియేట్ చేసింది. కాగా, వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు శ్యామ్‌ సీఎస్ సంగీతం అందిస్తున్నారు.


Share

Related posts

Devatha Serial: హద్దులు మిరుతున్న మాధవ్.. ఆదిత్య బాధకు నువ్వే కారణమా రాధక్క..!

bharani jella

బిగ్ బాస్ 4 : అభిజిత్ కు అగ్ని పరీక్ష..! మోనాల్ కి బంపర్ ఆఫర్

arun kanna

Sakshi Agarwal Recent Photos

Gallery Desk
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar