’ఛలో’, ’గీత గోవిందం’, ’డియర్ కామ్రేడ్’ వంటి సూపర్‌హిట్ చిత్రాల్లో హీరోయిన్గా నటించి యూత్‌తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్‌లోనూ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు రష్మిక మందన్నా. తాజాగా మహేశ్ హీరోగా దిల్ రాజు శ్రీవెంకశ్వర క్రియేషన్స్ సమర్పణలో జిఎంబి ఎంటర్టైన్మెంట్, ఎ.కె. ఎంటర్టైన్మెంట్స్ పతాకాలపై యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న ’సరిలేరు నీకెవ్వరు’ చిత్రంలో నటిస్తోంది. సంక్రాంతి కానుకగా జనవరి 11న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతున్న సందర్భంగా హీరోయిన్ రష్మిక మందన్నతో ఇంటర్వ్యూ.
ఈ సినిమాలో మీ క్యారెక్టర్ ఎలా ఉంటుంది?
– మీరు ట్రైలర్ చూస్తే ఈపాటికి అర్థం అయి ఉంటుంది. హీరో వెంటపడి బాగా అల్లరి చేసే క్యారెక్టర్. ఎక్స్ట్రీమ్లీ డ్రమటిక్ అండ్ కామికల్‌గా ఉంటుంది. ఈ సినిమా ద్వారా నాకు ఫుల్ లెంగ్త్ కామెడీ చేసే అవకాశం దక్కింది.
మహేశ్‌లో నచ్చిన క్వాలిటీస్ ఏంటి?
– సెట్లో మహేశ్‌గారు చాలా క్వైట్ అండ్ కామ్‌గా ఉండేవారు. నేనే వెళ్ళి తనని డిస్ట్రబ్ చేసేదాన్ని.
మీ క్యారెక్టర్‌కి సెపరేట్ మేనరిజమ్ ఉన్నట్లుంది?
– అవునండీ. అలాగే ఐయాం ఇంప్రెస్డ్లాంటి మేనరిజమ్స్ సినిమా అంతా ఉంటుంది. దాంతో పాటు సంగీతగారితో కలిసి చేసే నెవ్వర్ బిఫోర్, ఎవ్వర్ ఆఫ్టర్లాంటి మేనరిజమ్స్ ఆడియన్స్‌కి బాగా రీచ్ అవుతాయి.
విజయశాంతిగారితో ఇంత తక్కువ టైమ్‌లో అంత బాండింగ్ ఎలా ఏర్పడింది?
– కేరళ షెడ్యూల్లో నేను మొదటిసారి ఆమెను కలిశాను. ఆమెతో మాట్లాడాలంటే కొంచెం భయం వేసింది. తర్వాత సెట్లో ఆమె ఎనర్జీ చూసి ఫిదా అయ్యాను. ఆ తర్వాత డ్యాన్స్, నటనకి సంబంధించిన కొన్ని సలహాలు అడిగి తెలుసుకున్నాను.
ఈ సినిమా మీరు ఓకే చేయడానికి రీజన్?
– అనిల్ సర్ ఈ స్క్రిప్ట్ నేరేట్ చేసేటప్పుడే నా క్యారెక్టర్, సంగీతగారి క్యారెక్టర్ ఎలా ఉంటుందో యాక్ట్ చేసి చూపించారు. అప్పుడే నాకు బాగా నచ్చింది. అందులోనూ ఈ సినిమాలో మంచి ఫీల్ ఉంది. అలాగే మహేశ్, విజయశాంతిగారితో కలిసి నటించడం బోనస్.
ట్రైయిన్ ఎపిసోడ్ గురించి?
– నేను డబ్బింగ్ చెబుతున్నప్పుడు ఆ సన్నివేశాలు చూసి నవ్వు ఆపుకోలేకపోయాను. షూటింగ్ చేస్తున్నప్పుడే టీమ్ అంతా బాగా నవ్వుకున్నాం. రేపు ప్రేక్షకులు కూడా ఆ కామెడీ ట్రాక్‌ని పూర్తిగా ఎంజాయ్ చేస్తారు.
మైండ్ బ్లాక్ సాంగ్?
– ఆ సాంగ్ చిత్రీకరణ రోజు ఈ అమ్మాయికి డ్యాన్స్ వచ్చో, రాదో అనే సందేహం అందరికీ ఉంది. కానీ ఒక చిన్న డ్యాన్స్ బిట్ చేసి చూపించాను. అందరూ ఎగ్జైట్ అయ్యారు. అలా మహేశ్‌గారితో డ్యాన్స్ చేయడం చాలా ఎంజాయ్ చేశాను.
మీ నెక్స్ట్ మూవీస్?
– ప్రస్తుతం నితిన్‌తో ’భీష్మ’ చిత్రం చేస్తున్నాను. అల్లు అర్జున్, సుకుమార్‌ల కాంబినేషన్లో మూవీ చేస్తున్నాను. ఇంకో రెండు సినిమాలు చర్చల దశలో ఉన్నాయి అంటూ ఇంటర్వ్యూ ముగించారు హీరోయిన్ రష్మిక మందన్న.
previous post
next post
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!