తెలుగు, తమిళంలో మంచి మార్కెట్ ఉన్న హీరో సూర్య నటిస్తోన్నయాక్షన్ థ్రిల్లర్ `ఆకాశం నీ హద్దురా`. `గురు` ఫేమ్ సుధా కొంగర ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నారు. 2డీ ఎంటర్టైన్మెంట్, సిక్యా ఎంటర్టైన్మెంట్ పతాకాలపై సూర్య, రాజశేఖర్ కర్పూర సుందరపాండ్యన్, గుణీత్ మోంగ, ఆలిఫ్ సుర్తిలతో కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తుఉన్నారు. ఈ సినిమా టీజర్‌ను మంగళవారం చిత్ర యూనిట్ విడుదల చేసింది. డా.మంచు మోహన్‌బాబు వాయిస్ ఓవర్‌తో ప్రారంభమవుతుంది.
ఈ చిత్రంలో సూర్య మధ్య తరగతి వ్యక్తిగా కనిపిస్తున్నారు. సొంతంగా ఎయిర్‌లైన్స్ కంపెనీ పెట్టాలనే ఆలోచన ఉన్న సూర్యను పలువురు అవమానిస్తారు. టాటా వల్లే కానిది నీకెలా సాధ్యమవుతుందని ఎగతాళి చేస్తారు. యథార్థ గాథను ఆధారంగా చేసుకుని ఓ సాధారణ వ్యక్తి తన ప్రయాణంలో సమస్యలను అధిగమించి తన కలను ఎలా నేరవేర్చుకున్నాడనేదే సినిమా అని టీజర్ చూస్తే అవగాహన కలుగుతుంది. సూర్య ఔట్‌స్టాండింగ్ పెర్ఫామెన్స్‌ను టీజర్లో చూడొచ్చు. జెహోవసన్ అల్గర్ అద్భుతమైన బ్యాగ్రౌండ్ మ్యూజిక్‌ను అందించారు. నిర్మాణ విలువలు అద్భుతంగా ఉన్నాయి.
డా.మోహన్‌బాబు, పరేష్‌రావల్, అపర్ణ బాలమురళి, ప్రకాశ్ బెలవాడి, ఊర్వశి ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు. చెన్నై, హైదరాబాద్, చతీఘడ్, మధురై ప్రాంతాల్లో సినిమాను 60 రోజుల్లో చిత్రీకరించారు. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసి సినిమాను ఈ ఏడాది సమ్మర్లో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.
Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!