అందువల్ల బ్రేక్ తీసుకోనున్న ప్రభాస్

యంగ్ రెబ‌ల్ స్టార్.. ఈ మాట విన‌గానే అమ్మయిల గుండెల్లో ప్రేమ పుట్టుకొస్తుంది. ఇక అబ్బాయిల విష‌యానికి వ‌స్తే.. ఆయ‌న స్టైల్, యాక్ష‌న్ అంటే ప‌డి చ‌స్తారు. అలాంటి ప్ర‌భాస్ ఇప్పుడు కేవ‌లం తెలుగు సినీ హీరో మాత్ర‌మే కాదు. ఆయ‌న పాన్ ఇండియన్ హీరో. అందుకే ప్ర‌తీ ఒక్క‌రు ఆయ‌న‌ను గ‌మ‌నిస్తుంటారు. అయితే ఆయ‌న ఇప్పుడు తీసుకున్న నిర్ణ‌యంతో ప‌లువురు టెన్ష‌న్ ప‌డుతున్నారు. రెబ‌ల్ స్టార్ ఇలా చేయడం ఏంట‌ని అనుకుంటున్నారు.

అయితే ఆయ‌న తీసుకున్న ఆ నిర్ణ‌యం ఇప్పుడే కాదండోయ్. మరో రెండేళ్ళ తర్వాత సంగ‌తి ఇది. కానీ అప్పుడైనా ఇలాంటి నిర్ణ‌యం ఏంట‌ని డైర‌క్ట‌ర్లు, ప్రొడ్యూస‌ర్లు ఆశ్చ‌ర్య‌పోతున్నారు. ప్ర‌భాస్ కు అన్ని భాషల్లోనూ మంచి మార్కెట్ ఉంది. బాహుబలి సినిమాతో వచ్చిన ఇమేజ్ మాత్ర‌మే కాదు. త‌నంటే ఏంటో నిరుపించుకునే ప్ర‌య‌త్నంలో ప్ర‌భాస్ ఉన్నాడు. అలాంటి ప్ర‌య‌త్నం సాహో సినిమాలో క‌నిపించింది. అందుకే హిందీలో ఈ సినిమాకు కూడా 150 కోట్లకు పైగా వసూలు వ‌చ్చాయి. ఈ సినిమా తెలుగులో ఫ్లాప్ అయ్యింది. బ‌ట్ హిందీలో మాత్రం సూప‌ర్ హిట్ అని చెప్పొచ్చు.

దీంతో నిర్మాత‌ల‌కు ప్ర‌భాస్ పై మంచి న‌మ్మ‌కం వ‌చ్చింది. అందుకే ప్ర‌భాస్ చేస్తున్న సినిమాలకు బడ్జెట్ ఎంతైనా ఆలోచించ‌కుండా పెట్ట‌డానికి నిర్మా‌త‌లు సిద్ధంగా ఉన్నారు. ఒక్కో సినిమాకు వందల కోట్లు పెట్టెందుకు నిర్మాతలు రెడీగా ఉన్నారంటే ఆయ‌న క్రేజ్ ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవాలి. అయితే ఈ విష‌యం ప్రస్తుతం ప్రభాస్ కమిటైన 4 సినిమాల బడ్జెట్ ను చూస్తే అర్థం అవుతుంది. ఆ సినిమాల‌కు రూ. 1000 కోట్లు దాటిపోయిందంటే ఇక ఆలోచించండి ఆయ‌న క్రేజ్..

ఇందులో రాధాకృష్ణ కుమార్ తీస్తున్న‌ రాధే శ్యామ్ బడ్జెట్ 140 కోట్లు. యూవీ క్రియేషన్స్, గోపీకృష్ణ మూవీస్ క‌లిసి ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. ఇక త‌ర్వాత వ‌చ్చే సలార్ బడ్జెట్ కూడా 140 కోట్లకు పైగానే ఉంటుంద‌ని టాక్. ఇక త‌ర్వాత వ‌చ్చేది ఆదిపురుష్ పౌరాణిక చిత్రం. అందులో రాముడిగా నటించబోతున్నాడు మ‌న యంగ్ రెబ‌ల్ స్టార్. ఈ సినిమా కోసం రూ. 300 కోట్ల బడ్జెట్ ప్లాన్ చేస్తున్నార‌ట‌. ఈ సినిమాని ఓం రౌత్ తెరకెక్కించనున్నాడు. ఆ నెక్ట్స్ నాగ్ అశ్విన్ తీసే సినిమాకు రూ 400 కోట్లు ఖర్చు చేయ‌నున్న‌ట్లు నిర్మాత ఇప్ప‌టికే ప్ర‌క‌టించాడు.

ఇక ప్ర‌భాస్ తీసుకున్న నిర్ణ‌యం విష‌యానికి వ‌స్తే.. చాలా కాలంగా ప్ర‌భాస్ వ‌రుస ప్రాజెక్ట్ ల‌తో బిజీ బిజీగా ఉంటున్నాడు. క‌మిటైన ఈ నాలుగు సినిమాల త‌ర్వాత ఒక యేడాది బ్రేక్ తీసుకోవాల‌ని ఆలోచిస్తున్నాడ‌ట‌. ఆ స‌మ‌యంలో పూర్తిగా సినిమాల‌కు దూరంగా ఉంటూ పర్సనల్ లైఫ్ ఎంజాయ్ చేయాలని భావిస్తున్నాడ‌ట‌.