Regina: టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక టైంలో హీరోయిన్ రెజీనా కుర్ర హీరోలతో భారీ ఛాన్స్ లు అందుకోవడం జరిగింది. సందీప్ కిషన్.. అల్లు శిరీష్ ఇంకా చాలామంది కుర్ర హీరోలతో నటించిన రెజీనా.. రవితేజ తో కూడా నటించి మంచి హిట్ అందుకుంది. ఓ మాదిరి గుర్తింపు కలిగిన ఈ ముద్దుగుమ్మకి గత కొన్ని నెలల నుండి మాత్రం పెద్దగా అవకాశాలు దక్కడం లేదు. దీంతో రెజీనా కెరియర్ డేంజర్ జోన్ లో పడినట్లు… దుకాణం సర్దుకునే పరిస్థితి వచ్చినట్లు ఆమె తెలిపింది.
పరిస్థితి ఇలా ఉంటే ఊహించని రీతిలో అదిరిపోయే బిగ్ చాన్స్ తాజాగా రెజీనా కి దక్కింది. విషయంలోకి వెళితే 2005వ సంవత్సరంలో టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా నటించిన చత్రపతి సూపర్ డూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ఫస్టాఫ్ వోల్టేజ్ యాక్షన్.. సెకండాఫ్ అమ్మ సెంటిమెంట్ తో.. రాజమౌళి తీసిన “చత్రపతి” అప్పట్లో బాక్సాఫీస్ దగ్గర అనేక రికార్డులు సృష్టించింది.
Read More: Tollywood: సినిమాల్లో రాని సమయంలో హీరోల ఒరిజినల్ పేర్లు లిస్ట్..!!
ఇప్పుడు ఈ సినిమా ఆధారంగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా బాలీవుడ్ ఇండస్ట్రీలో డైరెక్టర్ వి.వి.వినాయక్ తెరకెక్కిస్తున్నారు. అయితే ఈ సినిమాలో హీరోయిన్ పాత్రలో రెజీనా నీ తీసుకోవడం జరిగింది అంట. తెలుగులో ప్రభాస్ సరసన హీరోయిన్ గా నటించింది. అయితే బాలీవుడ్ కావడంతో అవకాశాలు లేని నాకు ఒక్కసారిగా బాలీవుడ్ తెరపై కనిపించే ఛాన్స్ రావడంతో ఈ వార్త ఇండస్ట్రీ వర్గాలలో హైలెట్ గా మారింది.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!