Tragedy: విశాఖ జిల్లాలో విషాదం..! వాగులో పడి నలుగురు చిన్నారులు మృతి..!!

Share

Tragedy: విశాఖ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. వి మాడుగుల మండలం జాలంపిల్లి వద్ద పెద్దేరు వాగులో పడి నలుగురు చిన్నారులు గల్లంతు అయ్యారు. బట్టలు ఉతికేందుకు పెద్దలతో పాటు వెళ్లిన చిన్నారులు ప్రమాదవశాత్తు పెద్దరేవు ఊబిలో చిక్కుకున్నారు.

Tragedy: four children fell into the river and died
Tragedy: four children fell into the river and died

విషయం తెలుసుకున్న గ్రామస్తులు గాలింపు చర్యలు చేపట్టగా అప్పటికే ప్రాణాలు కోల్పోయారు. వాగులో నుండి నలుగురు చిన్నారుల మృతదేహాలను ఒడ్డుకు చేర్చారు. మృతి చెందిన వారిలో నీలాపు మహేందర్ (7), వంత్తాల వెంకట ఝాన్సీ (10), వంత్తాల షర్మిల (7), వంత్తాల ఝుహ్నవి (11) ఉన్నారు. విషయం తెలిసిన వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


Share

Related posts

బ్రేకింగ్: సోనియాకు షాక్ ఇచ్చిన కేంద్రం, ట్రస్ట్ లావాదేవీలపై విచారణకు ఆదేశం

Vihari

చంద్రబాబు కి హెల్ప్ చేద్దామనుకుని స్కెచ్ వేసి అందులో బాబునే ఇరికించిన ఎల్లో మీడియా ?

sekhar

అల్లు అర్జున్ ఆపడా.. ఇంకా ఎన్నాళ్ళు..?

GRK