RRR: దేశవ్యాప్తంగా “RRR” మేనియా క్రియేట్ అయి ఉంది. బాహుబలి(Bahubali) తర్వాత రాజమౌళి(Rajamouli) దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా జనవరి ఏడవ తారీఖున ప్రపంచవ్యాప్తంగా ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఏ సినిమా రిలీజ్ అవ్వని విధంగా.. కొన్ని వేల స్క్రీన్స్ పై విడుదల కానుంది. ఈ క్రమంలో సినిమాకి సంబంధించి ప్రమోషన్ కార్యక్రమాల్లో.. డైరెక్టర్ రాజమౌళి, హీరోలు రామ్ చరణ్(Ram Charan), ఎన్టీఆర్(NTR).. చురుగ్గా పాల్గొంటున్నారు. ఇప్పటికే బాలీవుడ్(Bollywood) ఇండస్ట్రీకి సంబంధించి ముంబై(Mumbai)లో ప్రీ రిలీజ్ వేడుక ఘనంగా నిర్వహించటం తెలిసిందే.
ఇక ఇదే సమయంలో తమిళంలో మరియు మలయాళం లో కూడా.. సినిమాకి సంబంధించి ప్రీ రిలీజ్ వేడుక ఇటీవల నిర్వహించారు. తమిళ మలయాళ ప్రేక్షకుల నుండి భారీ రెస్పాన్స్ వచ్చింది. మూడు ప్రీరిలీజ్ వేడుకలలో.. రాజమౌళి… ఎన్టీఆర్.. చరణ్ చాలా బావోద్వేగం గా మాట్లాడారు. చాలా ఎమోషనల్ కూడా అయ్యారు. ఇదిలా ఉంటే ఈ సినిమాలో ఇంటర్వెల్ బ్యాంగ్ సినిమా మొత్తానికే హైలైట్ అని.. ఇప్పటికే ఫారెన్ మరియు ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీకు చెందిన సెన్సార్ బోర్డు నుండి సమాచారం రావడం జరిగింది.
ఈ క్రమంలో ఇంటర్వెల్ బ్యాంగ్ కోసం ఏ స్థాయి ఖర్చు జరిగిందో..? ఎన్ని రోజులు పని చేయడం జరిగింది అనేదాని గురించి రాజమౌళి సరికొత్త విషయాలు సినిమా ప్రమోషన్ కార్యక్రమంలో తెలియజేశారు. ఇంటర్వెల్ షూటింగ్ మొత్తం 65 రాత్రులు.. చిత్రీకరించినట్లు ఒక్క రాత్రి ఖర్చు.. దాదాపు 75 లక్షలు అన్నట్లు చెప్పుకొచ్చారు. దేశవ్యాప్తంగా ఉన్న వందలాది మంది నటీనటులు ఈ ఇంటర్వెల్ బ్యాంగ్ లో నటించడం జరిగిందని రాజమౌళి సరికొత్త విషయాలు తెలియజేశారు. దీంతో ఇంటర్వెల్ పార్ట్ సినిమా మొత్తానికి హైలెట్ గా ఉంటుంది అని “RRR” సినిమా ప్రేక్షకులు డిసైడ్ అయిపోయారు. జనవరి 7 కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాని నిర్మించడం కోసం దాదాపు 600 కోట్ల రూపాయలకు పైగానే ఖర్చు చేసినట్లు వార్తలు వస్తున్నాయి.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!