న్యూస్ సినిమా

Sai pallavi: చిరంజీవికి నో చెప్పి మహేశ్‌కు ఎస్ చెప్పి షాకిచ్చిన సాయి పల్లవి..?

Share

Sai pallavi: మెగాస్టార్ చిరంజీవి సినిమాలో నటించమని అడిగితే ఫిదా బ్యూటీ సాయి పల్లవి నిర్మొహమాటంగా నో చెప్పిన సంగతి తెలిసిందే. రీ ఎంట్రీ తర్వాత మెగాస్టార్ వరుసగా క్రేజీ ప్రాజెక్ట్స్‌ను లైన్‌లో పెట్టిన సంగతి తెలిసిందే. అందులో మెహర్ రమేశ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భోళా శంకర్ సినిమా ఒకటి. ఇటీవల షూటింగ్ ప్రారంభమైన ఈ సినిమా చిత్రీకరణ శరవేగంగా సాగుతోంది. ఇప్పటికే సాంగ్, ఓ ఫైట్ కొంత టాకీ పార్ట్ కూడా పూర్తైంది. ఇందులో చిరు సరసన మిల్కీ బ్యూటీ తమన్నాను హీరోయిన్‌గా ఎంచుకున్నారు.

sai-pallavi-says no to mahesh babu movie
sai-pallavi-says no to mahesh babu movie

అంతకంటే ముందే స్టార్ హీరోయిన్ కీర్తి సురేశ్‌ను మెగాస్టార్ చెల్లి పాత్రకు ఎంపిక చేసుకున్నారు. అంతేకాదు ఈ మేరకు రాఖీ పండుగ సందర్భంగా చిరుకు కీర్తి రాఖీ కడుతున్న పోస్టర్‌ను కూడా వదిలారు. అయితే కీర్తి కంటే ముందు ఈ పాత్రకు మేకర్స్ సాయి పల్లవిని సంప్రదించగా ఆమె వారికి నిర్మొహమాటంగా నో చెప్పేసింది. లవ్ స్టోరి సినిమా ఫంక్షన్‌లో ఎందుకు నో చెప్పిందో కూడా కారణం చెప్పింది సాయి పల్లవి. ఇప్పుడు మహేశ్ బాబు సినిమాకు మాత్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది తాజాగా వార్తలు వస్తున్నాయి. మహేశ్ బాబు ఇప్పుడు సర్కారు వారి పాట సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే.

Sai pallavi: సాయి పల్లవి మహేశ్‌కు చెల్లిగా నటించేందుకు గ్రీన్ సిగ్నల్..?

దీని తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో హ్యాట్రిక్ సినిమాను చేయబోతున్నాడు మహేశ్. ఈ సినిమాకు త్రివిక్రమ్ కాస్త సిస్టర్ సెంటిమెంట్‌ను జోడించినట్టు తెలుస్తోంది. అందుకే మంచి నేచురల్ పర్ఫార్మర్ అయితే సీన్స్ బాగా వస్తాయని భావించిన దర్శకుడు ఆ పాత్రకు సాయి పల్లవి అయితే పర్‌ఫెక్ట్ అని భావించి ఆమెను సంప్రదించారట. త్రివిక్రమ్ సినిమాలో పాత్రలు చాలా బలంగా ఎమోషన్స్‌గా ఉంటాయి. అలాగే సిస్టర్ పాత్రలో చాలా ఎమోషన్స్ ఉన్నాయట. ఇది నచ్చి సాయి పల్లవి మహేశ్‌కు చెల్లిగా నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని టాక్ వినిపిస్తోంది. దీనిపై మేకర్స్ నుంచి క్లారిటీ రావాల్సి ఉంది.


Share

Related posts

Shanmukh: వామ్మో.. షణ్ముఖ్ కి అంత సీనుందా? టాప్ 10లో రెండు స్థానాలు తనవేనట.!

Ram

ఆయ‌నే మెగాస్టార్, ఆయ‌న త‌ర్వాతే ఎవ‌రైనా: చిరంజీవి

Siva Prasad

Shriya Sharma White Saree Photos

Gallery Desk
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar