సినిమా

Samantha: అబద్ధాలే రాజ్యమేలుతాయి.. వైరల్ అవుతున్న సమంత ఇన్స్టా పోస్ట్!

Share

Samantha: సమంత సినిమా కెరీర్ మంచి స్వింగ్ లో వుంది. విడాకుల అనంతరం ఎవ్వరు ఊహించని విధంగా సామ్ వరుస ప్రాజెక్ట్స్ కు సైన్ చేస్తూ ఫుల్ బిజీగా గడుపుతోంది. సామ్ అందరిలాగే సోషల్ మీడియాలో మంచి యాక్టివ్ గా వున్న సంగతి తెలిసినదే. ఇక డివోర్స్ తర్వాత సామ్ సోషల్ మీడియాలో పెట్టే పోస్టులపై అందరి దృష్టి పెడుతున్నారు. ఎందుకంటే ఆమె మునిపటి కంటే ఎంతో క్రేజీ పోస్టులు చేయడమే దానికి కారణం. సందేశాత్మక సూక్తుల నుండి, సమాజ హితం కోరే కొన్ని సంఘటనలు కూడా పోస్ట్ చేయడం సామ్ ప్రత్యేకత.

Samantha Insta Post Going Viral!
Samantha Insta Post Going Viral!

అబద్ధాలే రాజ్యమేలుతాయి?

ఈ క్రమంలో తాజాగా సామ్ తన ఇన్స్టా వేదికగా షేర్ చేసిన ఓ కొటేషన్ వైరల్ అవుతోంది. అదేమంటే, “నిజాలు అనేవి అరుదుగా బయటకు వస్తాయి కానీ, అబద్ధాలనేవి ఎప్పుడూ ప్రచారంలో ఉంటాయి.” అంటూ ఒక హాలీవుడ్ సినిమా గురించి సమంత పోస్ట్ పెట్టింది. అయితే ఈ పోస్ట్ ఇపుడు వైరల్ అవుతోంది. దీన్ని చూసిన నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. కొంతమంది దాన్ని ఆమె పర్సనల్ లైఫ్ తో లింక్ చేస్తూ కామెంట్లు పెడుతున్నారు. కొందరు పాజిటివ్ గా స్పందిస్తే, ఓ వర్గం వారు మాత్రం ట్రోల్ చేస్తున్నారు.

Samantha Insta Post Going Viral!
Samantha Insta Post Going Viral!

సామ్ ప్రయాణం

‘ఏమాయ చేసావే’ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ యావత్ తెలుగు యువతని మాయలో పడేసి, అంతటితో ఆగకుండా, ఆ సినిమాలో నటించినటువంటి అక్కినేని నాగచైతన్యను కూడా మాయలో పడేసి, ఆఖరకు పెళ్లి కూడా చేసేసుకుంది. అయితే దాని తరువాత కొన్ని అనూహ్య కారణాల వలన గతేడాది అక్టోబర్ నెలలో విడిపోతున్నామంటూ అధికారికంగా ప్రకటించారు. అప్పటి నుంచి చై సామ్ వేర్వేరు దారుల్లో ఎవరి లైఫ్ వారు బతుకుతున్నారు. ఎక్కడివరకు బానేవుంది. వారిద్దరికీ ఏ సమస్య లేదు. కానీ అస్సలు సంబంధం లేని సో కాల్డ్ అభిమానులు మాత్రం సామ్ ని వీలు చిక్కినప్పుడల్లా ట్రోల్స్ చేస్తున్నారు. మొదట వీటికి కొంచెం భయపడ్డ సామ్ తరువాత తరువాత తనపని తాను చేసుకుంటూ బిజీగా మారింది.


Share

Related posts

Priya Prakash Varrier Blue Dress Images

Gallery Desk

 యంగ్ టైగ‌ర్‌కు జ‌త‌గా పూరీ హీరోయిన్‌..! అందాల‌తో అద‌ర‌గొట్టేస్తున్న ఆ భామ ఎవ‌రో తెలుసా?

Teja

Sreedevi Soda Center Glimpse: యూట్యూబ్ లో ప్రభంజనం సృష్టిస్తున్న సుధీర్ బాబు..!!

bharani jella
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar