Samantha: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ప్రధాన పాత్రలో నటించిన చిత్రం యశోద.. ఈ సినిమా ధియేటర్స్ లో విడుదలై పాజిటివ్ టాక్ ను సొంతం చేస్తుంది.. ఇప్పటికే ఈ సినిమా 20 కోట్ల వరకు కలెక్ట్ చేసినట్లు చిత్ర యూనిట్ తెలిపింది. ఈ సినిమా సక్సెస్ మీట్ లో భాగంగా యశోద సినిమాలో నటించిన కల్పిగా గణేష్ పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు..! అందులో భాగంగా సమంత హెల్త్ కండిషన్ గురించి కూడా వివరించారు..!
కల్పిక మాట్లాడుతూ.. మేమంతా సమంతని మిస్ అవుతున్నాం.. సమంత ఈ సక్సెస్ వీటికి వస్తానని నాకు అబద్ధం చెప్పారు. సమంత వస్తున్నారని తెలిసి నేను పరుగెత్తుకుంటూ వచ్చా.. నాకు హాస్పిటల్ లో అపాయింట్మెంట్ ఉన్న వదిలేసి వచ్చా.. సమంతకి ఉన్న హెల్త్ ఇష్యూ నాకు కూడా గత 13 ఏళ్ల నుంచి ఉంది.. అయితే ఇప్పుడు నేను ఫస్ట్ స్టేజ్ లో ఉన్నా.. సమంతది థర్డ్ స్టేజ్ అని కల్పిక చెప్పారు. ఈ విషయం తెలిసి సమంత అభిమానులు కంగారుపడుతున్నారు.
యశోద సినిమా పాన్ ఇండియా వైడ్ గా ఐదు భాషల్లో విడుదలైంది. తొలి 5 రోజుల్లోనే ఓవరాల్ గా రూ.21.45 కోట్లని కలెక్ట్ చేసింది. ఈ సినిమా ఓవర్సీస్ లో రూ.5.8 కోట్లు రాబట్టడం విశేషం. ఈ సినిమాని 30 కోట్ల బడ్జెట్ తో రూపొందించారు. హరి హరీష్ దర్శకత్వంలో శివలంక కృష్ణ ప్రసాద్ నిర్మించిన ఈ సినిమా రెండో వారంలో కూడా స్ట్రాంగ్ కలెక్షన్స్ వసూలు చేస్తుంది. సమంత ఈ సినిమాలో వన్ మ్యాన్ షో చేసి మరో సారి తన క్రేజ్ ఏంటో చూపించింది.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!