Shaakuntalam: సమంత ప్రస్తుతం “శాకుంతలం” సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో ఫుల్ బిజీగా గడుపుతూ ఉంది. ఏప్రిల్ 14వ తారీకు ఈ సినిమా విడుదల కానుంది. పౌరాణిక నేపథ్యంలో దిల్ రాజు సమర్పణలో గుణ టీమ్ వర్క్స్ పతాకంపై నీలిమా గుణ నిర్మిస్తున్న ఈ సినిమాకు గుణశేఖర్ దర్శకత్వం వహిస్తున్నారు. సీనియర్ హీరో మోహన్ బాబు కీలక పాత్ర పోషించడం జరిగింది. దేవ్ మోహన్, అదితీబాలన్ ప్రధాన పాత్రలో నటిస్తూ ఉన్నారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూతురు అల్లు అర్హ కూడా ఈ సినిమాలో నటించింది.
ఈ సందర్భంగా ఈ సినిమాకి సంబంధించి సమంత 5 ఇంట్రెస్టింగ్ విషయాలు తాజా ఇంటర్వ్యూలో పంచుకుంది. సినిమాలో తన పాత్రకి సంబంధించి చేతికి పెట్టుకున్న పూలు మేకప్ మచ్చలు అలాగే ఉండేవని తెలిపింది. మూడు భాషలలో డబ్బింగ్ చెప్పినట్లు స్పష్టం చేసింది. సాంగ్ లో లేహంగ డ్యాన్స్ చేయటంలో ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు పేర్కొంది. ఇంకా షూటింగ్ టైంలో కొన్ని సన్నివేశాలలో కుందేలు కరిచినట్లు చెప్పుకొచ్చింది. చివరిగా ఈ సినిమాలో తనది ఒరిజినల్ జుట్టు కాదని సమంత సంచలన వ్యాఖ్యలు చేసింది. దీనికి సంబంధించిన వీడియోను సమంత తన ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేయడం జరిగింది. దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
మహాభారతంలోని అద్భుతమైన ప్రేమ కథగా చెప్పుకునే దుష్యంత, శకుంతల ప్రేమ కథను మహాకవి కాళిదాసు అభిజ్ఞానశాతం తలం కావ్యంగా రాయడం జరిగింది. దాని ఆధారం చేసుకుని సిల్వర్ స్క్రీన్ పై గుణశేఖర్ రూపొందించిన విజువల్ “శాకుంతలం”. ఈ సినిమా తెలుగుతోపాటు తమిళం మరియు హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో పాన్ ఇండియా లెవెల్ లో విడుదల అవుతూ ఉంది. “శాకుంతలం” పౌరాణిక నేపథ్యంలో వస్తున్న సినిమా కావటంతో జనాలు మంచి ఇంట్రెస్ట్ మీద ఉన్నారు. డైరెక్టర్ గుణశేఖర్ చాల ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాని చిత్రీకరించడం జరిగింది. విజువల్ వండర్ గా ఫ్యాన్ ఇండియా మూవీగా ఈ నెల 14వ తారీకు ఈ సినిమా రిలీజ్ కానుంది.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!