సినిమా

Sarkaru Vaari Paata: 2వ రోజు కూడా అద‌ర‌గొట్టిన మ‌హేశ్‌..ఇంకా రావాల్సింది ఎంతంటే?

Share

Sarkaru Vaari Paata: సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు హీరోగా, కీర్తి సురేష్ హీరోయిన్‌గా ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు ప‌ర‌శురామ్ రూపొందించిన‌ తాజా చిత్రం `స‌ర్కారు వారి పాట‌`. మైత్రి మూవీ మేకర్స్, జీఎమ్‌బి ఎంటర్‌టైన్‌మెంట్, 14 రీల్స్ ప్లస్ బ్యాన‌ర్ల‌పై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్, రామ్ ఆచంట, గోపి ఆచంట సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి త‌మ‌న్ స్వ‌రాలు అందించారు.

ఇందులో కీర్తి సురేష్ హీరోయిన్‌గా న‌టించ‌గా.. స‌ముద్ర‌ఖ‌ని విల‌న్‌గా చేశారు. నదియా, వెన్నెల కిషోర్, సౌమ్య మీనన్, సుబ్బరాజు, అజయ్, బ్రహ్మాజి, తనికెళ్ల భ‌ర‌ణి తదితరులు కీల‌క పాత్ర‌ల‌ను పోషించారు. బ్యాంకులు, ఈఎంఐలు, అప్పుల చుట్టూ ఈ కథ తిరుగుతుంది. భారీ అంచ‌నాల న‌డుమ మే 12న విడుద‌లైన ఈ చిత్రం మిక్స్డ్ టాక్ సొంతం చేసుకుంది. అయిన‌ప్ప‌టికీ ఈ మూవా బాక్సాఫీస్ వ‌ద్ద భారీ క‌లెక్ష‌న్స్ రాబ‌డుతూ దూసుకుపోతోంది.

ఫ‌స్డ్ డే తెలుగు రాష్ట్రాల్లో రూ. 36.01 కోట్ల రేంజ్‌లో షేర్ వ‌సూల్ చేసిన ఈ చిత్రం.. రెండో రోజు రూ. 11.04 కోట్ల షేర్ ను రాబ‌ట్టి అద‌ర‌గొట్టేసింది. ఇక ఏరియాల వారీగా స‌ర్కారు వారి పాట ఫ‌స్ట్ డే టోట‌ల్ క‌లెక్ష‌న్స్ ఇలా ఉన్నాయి.

నైజాం: 17.10 కోట్లు
సీడెడ్: 5.96 కోట్లు
ఉత్త‌రాంధ్ర‌: 5.39 కోట్లు
తూర్పు: 4.33 కోట్లు
పశ్చిమ: 3.19 కోట్లు
గుంటూరు: 6.34 కోట్లు
కృష్ణ: 2.83 కోట్లు
నెల్లూరు: 1.91 కోట్లు
———————-
ఏపీ+తెలంగాణ‌= 47.05 కోట్లు(66.30 కోట్లు~ గ్రాస్)
———————-

రెస్ట్ ఆఫ్ ఇండియా+క‌ర్ణాట‌క‌: 3.35 కోట్లు
ఓవ‌ర్సీస్‌- 7.81 కోట్లు
————————
వ‌ర‌ల్డ్ వైడ్ టోట‌ల్ క‌లెక్ష‌న్‌: 58.21 కోట్లు(90 కోట్లు~ గ్రాస్)
————————

కాగా, ప్ర‌పంచ‌వ్యాప్తంగా రూ. 120 కోట్ల ప్రీ రిలీజ్‌ బిజినెస్ చేసిన స‌ర్కారు వారి పాట‌.. రూ. 121 కోట్ల టార్గెట్ తో బ‌రిలోకి దిగింది. దీంతో ఇప్పుడు ఈ మూవీ క్లీన్ హిట్ అవ్వాలంటే మొద‌టి రెండు రోజులు వ‌చ్చిన క‌లెక్ష‌న్స్ కాకుండా ఇంకా రూ. 62.79 కోట్ల షేర్ ని రాబ‌ట్టాల్సి ఉంటుంది.

 


Share

Related posts

Adipurush: సీత పాత్ర కోసం కష్టాలు పడుతున్న కృతిసనన్..

bharani jella

Mahesh Babu: ” రమేశ్ అన్నయ్యది ‘ఆ ఒక్క’ ఆఖరి కొరికా తీర్చలేకపోయాను ” కుమిలిపోతోన్న మహేశ్ బాబు!

bharani jella

Nidhhi Agerwal New HD Stills

Gallery Desk