సినిమా

Sarkaru Vaari Paata: `స‌ర్కారు వారి పాట`పై బిగ్ అప్డేట్‌.. ఇక నుంచీ ర‌చ్చ ర‌చ్చే!

Share

Sarkaru Vaari Paata: సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు తాజా చిత్రం `స‌ర్కారు వారి పాట‌`. ప‌రుశురామ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రంలో కీర్తి సురేష్ హీరోయిన్‌గా న‌టించింది. కమర్షియల్ ఎంటర్టైనర్ గా రూపుదిద్దుకున్న ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్, జీఎమ్‌బి ఎంటర్‌టైన్‌మెంట్, 14 రీల్స్ ప్లస్ బ్యాన‌ర్ల‌పై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్, రామ్ ఆచంట, గోపి ఆచంట సంయుక్తంగా నిర్మించ‌గా.. త‌మ‌న్ స్వ‌రాలు అందించాడు.

బ్యాంకింగ్ రంగంలో జరుగుతున్న భారీ కుంభకోణం నేప‌థ్యంలో తెర‌కెక్కిన ఈ చిత్రం వేస‌వి కానుక‌గా మే 12న ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చేందుకు సిద్ధం అవుతోంది. అయితే ఇంకా షూటింగ్ పూర్తి అవ్వ‌క‌పోవ‌డంతో.. అనుకున్న తేదీకి సినిమా వస్తుందా..? అన్న అనుమానాలు వ్య‌క్తం అవుతున్నారు. ఇలాంటి త‌రుణంలో స‌ర్కారు వారి పాట‌పై బిగ్ అప్డేట్ బ‌య‌ట‌కు వ‌చ్చింది.

అదేంటంటే.. ఈ సినిమా షూటింగ్ తాజాగా పూర్తి అయింది. చివ‌రిగా మ‌హేష్ బాబు, కీర్తి సురేష్‌ల‌పై ఓ మాస్ సాంగ్‌ను రామోజీ ఫిలిం సిటీలో చిత్రీక‌రించి ప్యాక‌ప్ చెప్పేశారు. ఈ విష‌యాన్ని మేక‌ర్స్ అధికారికంగా తెలియ‌జేసింది. అలాగే మ‌హేష్‌కు సంబంధించి ఓ మాస్ పిక్ ను కూడా షేర్ చేశారు. దీంతో అభిమానులు ఫుల్ ఖుషీ అయిపోతున్నారు.

షూటింగ్ పూర్తి అవ్వ‌డంతో.. ఇక‌పై మేక‌ర్స్ వ‌రుస అప్డేట్స్‌ను వ‌దులుతూ ర‌చ్చ ర‌చ్చే చేయ‌బోతున్నారు. కాగా, స‌ర్కారు వారి టైటిల్ సాంగ్‌ను ఏప్రిల్ 23న ఉదయం 11:07 గంటలకు వ‌ద‌ల‌బోతున్న‌ట్లు ఇప్ప‌టికే చిత్ర టీమ్ పేర్కొంది. ఈ సాంగ్ త‌ర్వాత మ‌రిన్ని స‌ర్‌ప్రైజ్‌లు ఈ మూవీ నుండి రాబోతున్నాయి.


Share

Related posts

Pavithra Lakshmi White Dress Stills

Gallery Desk

MouniRoy Amazing Looks

Gallery Desk

Hyper Aadi: హైపర్ ఆది పై ప్రముఖ హీరోయిన్ కామెంట్స్ వైరల్..!

Ram
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar