తెలుగు నాట రష్మీ, సుధీర్‌లు అంటే తెలియనివారు ఉండరనుకుంటా.. ! ఎందుకంటే బుల్లితెరపై తనదైన యాంకరింగ్‌తో దూసుకుపోతోంది రష్మీ. కేవలం బుల్లితెరనే కాకుండా సినిమాల్లో నటిస్తోంది అ అమ్మడు. తన అందమైన నటనతో.. చురకత్తులాంటి చూపులతో బుల్లితెర టాప్ రెటింగ్ షో జబర్ధస్త్ ఖతర్నాక్ కామెడీ షోతో తెలుగు నాట టాప్ యాంకర్‌గా వెలుగొందుతోంది. ఇటు సినిమాల్లోనూ నటిస్తోంది. ఆమె నటిస్తున్న చిత్రం బొమ్మ బ్లాక్ బ్లస్టర్ ట్రైలర్ ఇటీవలే విడుదలై ప్రేక్షకులలో ఆసక్తిని పెంచింది.
మరో వైపు బుల్లితెరపై జబర్ధస్త్‌తో పాటు పలు ప్రోగ్రామ్స్‌లో నటిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు సుడిగాలి సుధీర్. టీవీ కార్యక్రమాలే కాకుండా సినిమాల్లోనూ నటిస్తూ.. హీరోగా కూడా మారారు సుధీర్. అయితే, బుల్లితెర, వెండితెరపై మంచి గుర్తింపు తెచ్చుకున్న వీరిద్దరూ.. జంటగా చేసిన అనేక ప్రోగ్రామ్స్ తిరుగులేని రేటింగ్స్ సంపాదించుకున్నాయి. సుధీర్, రష్మీల జంట అంటే ప్రేక్షకులకు కనుల విందే అంటే అతిశయోక్తి కాదు. ఎందుకంటే ఈ జంట స్క్రీన్‌పై చేసే హంగామా, రోమాన్స్ లు ఆ స్థాయిలో ఉంటాయి మరి !
అందుకే, రష్మీ, సుధీర్ల జంట తెలుగు నాట మస్తు పాపులర్ దక్కించుకుంది. వీరిద్దరు కలిస్తే.. ఆ షోకు కావాల్సిన నవరసాలు అందుతాయి. వీరిద్దరు ఎక్స్ట్రా జబర్దస్త్ కామెడీ షోలో పాల్గొంటున్నారు. వీరి జంట మధ్య జరిగే అన్ స్క్రీన్ రోమాన్స్ కు చాలా మంది అభిమానులు ఉన్నారంటే వీరి జంట ప్రదర్శన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే, తాజాగా ఈ షో 300వ ఎపిసోడ్ లోకి అడుగుపెట్టడంతో… సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ క్రమంలోనే ఈ జంట మధ్య ఉన్న రిలేషన్ గురించి చెప్పమని రోజా కోరగా.. రష్మీతో తనకున్న అనుబంధం గురించి సుధీర్ చెబుతూ.. ప్రతి మగాడి విజయం వెనుక ఆడది ఉంటుంది అంటారు.. కానీ నా వెంట ఎనిమిది ఏళ్లుగా విజయమే ఉంది. అదే రష్మీ అంటూ సుధీర్ చెప్పు కొచ్చారు.
అయితే, తాము అనుకోకుండా కలిసామనీ, ఏడేళ్ల కిందట మొదలైన తమ ప్రయాణం.. ప్రక్షకుల ఆదరణతో మధ్యలో ఎక్కడ ఆగకుండా తమ జంట ప్రయాణం దూసుకుపోవడం సంతోషంగా ఉందనీ.. ఇప్పుడు ఎనిమిదో సంవత్సరంలోకి వెళ్తున్నామని తెలిపాడు సుధీర్. ఈ స్థాయిలో తమ జంటకు క్రేజ్ రావడానికి రష్మీనే కారణం అంటూ ఆమెపై ప్రశంసలు కురిపించాడు. రష్మీ.. థ్యాంక్యూ సో మచ్ అంటూ సుధీర్ అనగానే దానికి స్పందించిన రష్మీ.. తమ రిలేషన్‌షిప్‌కు ప్రత్యేక పేరు పెట్టాల్సిన పనిలేదనీ, తాము ఒకరినొకరం అర్థం చేసుకున్నామనీ.. అందుకే తమ జంట మంచి గుర్తింపు తెచ్చుకుందని అన్నారు. కొన్ని అనుబంధాలు అలా ఉంటాయి అంతే అనింది రష్మీ.