NewsOrbit
సినిమా

Shruti Haasan: ఆ నిర్ణ‌య‌మే శ్రుతి హాస‌న్ కెరీర్‌కి ప్ల‌స్ అయింది..లేకుంటే నిండా మునిగేది!

Shruti Haasan: సీనియ‌ర్ స్టార్ హీరో క‌మ‌ల్ హాస‌న్ కుతురు శ్రుతి హాస‌న్ అంటే తెలియ‌ని వారుండ‌రు. చైల్డ్ ఆర్టిస్ట్‌గా కెరీర్‌ను స్టార్ట్ చేసిన ఈ బ్యూటీ.. ప్రకాష్ కోవెలమూడి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన `అనగనగా ఓ ధీరుడు` సినిమాతో హీరోయిన్‌గా తెలుగు తెర‌కు ప‌రిచ‌యం అయింది. ఈ సినిమా ఫ్లాప్ అయినా న‌టిగా శ్రుతి హాస‌న్‌కు మంచి మార్కులు ప‌డ్డాయి. అదే స‌మ‌యంలో ఆమెకు మ‌రిన్ని అవ‌కాశాలు కూడా త‌లుపు త‌ట్టాయి.

దాంతో వ‌రుస సినిమాలు చేసిన శ్రుతి హాస‌న్‌.. అన‌తి కాలంలోనే స్టార్ స్టేట‌స్‌ను ద‌క్కించుకుంది. అలాగే ఎక్కువ స‌క్సెస్ రేటు ఉన్న హీరోయిన్స్‌లో ఒక‌రిగా శ్రుతి గుర్తింపు పొందింది. ఈమె న‌టించింన ఓ మై ఫ్రెండ్, గబ్బర్ సింగ్, బలుపు, రామయ్యా వస్తావయ్యా, ఎవ‌డు, రేసు గుర్రం, ఆగడు, శ్రీ‌మంతుడు, క్రాక్‌, వ‌కీల్ సాబ్ చిత్రాల్లో చాలా వ‌ర‌కు హిట్సే ఉన్నాయి.

ఇక‌పోతే గ‌తంలో శ్రుతి హాస‌న్ ప‌లు సినిమాల‌కు నో చెప్పింది. ఈమె రిజెక్ట్ చేసిన సినిమాల్లో కొన్ని బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్స్ ఉంటే.. మ‌రికొన్ని అట్ట‌ర్ ఫ్లాప్స్‌ కూడా ఉన్నాయి. అటువంటి వాటిల్లో `రెబ‌ల్` చిత్రం ఒక‌టి. పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ హీరోగా రాఘవ లారెన్స్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన చిత్ర‌మే రెబ‌ల్‌. ఇందులో తమన్నా మెయిన్ హీరోయిన్‌గా న‌టించ‌గా దీక్షాసేథ్ సెకెండ్ హీరోయిన్‌గా మెరిసింది.

శ్రీ బాలాజీ సినీ మీడియా బ్యాన‌ర్‌పై భగవాన్, పుల్లారావ్ క‌లిసి నిర్మించిన ఈ సినిమాలో ప్ర‌భాస్ పెద‌నాన్న కృష్ణంరాజు కీల‌క పాత్ర‌ను పోషించారు. ఇక భారీ అంచ‌నాల న‌డుమ 2012లో విడుద‌లైన ఈ చిత్రం బాక్సాఫీస్ వ‌ద్ద బిగ్గెస్ట్ డిజాస్ట‌ర్‌గా నిలిచి నిర్మాత‌ల‌కు న‌ష్టాల‌ను మిగిల్చింది. అయితే ఈ సినిమాలో హీరోయిన్‌గా మొద‌ట అనుష్క‌ను తీసుకోవాల‌ని అనుకోగా.. ఆమె నో చెప్పింద‌ట‌. దాంతో ఈ ఆఫ‌ర్ శ్రుతి హాస‌న్ వ‌ద్ద‌కు వెళ్లింద‌ట‌. కానీ, ఇత‌ర ప్రాజెక్ట్స్ కార‌ణంగా శ్రుతి సైతం సున్నితంగా రిజెక్ట్ చేయ‌గా.. చివ‌ర‌కు త‌మ‌న్నాను ఫైన‌ల్ చేశారు. ఏదేమైన‌ప్ప‌టికీ శ్రుతి హాస‌న్ నో చెప్ప‌డ‌మే ఆమెకు ప్ల‌స్ అయింది. లేదంటే కెరీర్ స్టార్టింగ్‌లోనే రెబ‌ల్ వంటి భారీ ఫ్లాప్‌తో నిండా మునిగేది.

 

Related posts

Brahmamudi April 27 2024 Episode 395: అనామికకి క్షమాపణ చెప్పానన్న కళ్యాణ్. అప్పు కళ్యాణ్ జైల్లో.. దుగ్గిరాల ఇంట్లో భీష్మించుకుని కూర్చున్న కనకం

bharani jella

Naga Panchami: పంచమి తన కడుపులో పెరుగుతుంది తన తల్లి విశాలాక్షి అని మోక్షకు చెబుతుందా లేదా.

siddhu

Mamagaru: గంగాధర్ ని ఆఫీస్ కి రమ్మంటున్న గంగ, తాగిన గంగాధర్ వెళ్తాడా లేదా..

siddhu

Nuvvu Nenu Prema 2024 Episode 608: పద్మావతికి తన మనసులో మాట చెప్పాలనుకున్న విక్కీ.. అను మీద ఆర్య ప్రేమ.. రేపటి ట్వీస్ట్..?

bharani jella

Krishna Mukunda Murari April 27 2024 Episode 456: నిజం తెలుసుకున్న కృష్ణ ఏం చేయనుంది? ముకుందను బెదిరించిన ఆదర్శ్.. రేపటి ట్విస్ట్..?

bharani jella

Pushpa 2: ‘పుష్ప 2’ కోసం బన్నీకి భారీ రెమ్యునరేషన్..?

sekhar

Guppedanta Manasu April 26 2024 Episode 1060: పోలీసులు మనూని అరెస్టు చేసి తీసుకువెళ్తారా

siddhu

Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!

Saranya Koduri

Sridevi: రామారావు బాడ్ హ్యాబిట్ కి నేను గురయ్యా.. ఆనాటి కాలంలో అతిలోక సుందరి ఎమోషనల్ కామెంట్స్..!

Saranya Koduri

Nindu Noorella Saavasam April 26 2024 Episode 221: ఈ తాళి నా మెడలోకి ఎలా వచ్చింది ని షాక్ అవుతున్న భాగమతి..

siddhu

Vaidya Visakhas: ఆ డైరెక్టర్ కి చనువు ఇస్తే అలా చేశాడు.‌.. షాకింగ్ నిజం బయటపెట్టిన బుల్లితెర యాంకర్..!

Saranya Koduri

Elon Musk: యూట్యూబ్ ని ఢీ కొట్టేందుకు వచ్చేస్తున్న ఎక్స్ టీవీ ఆప్..!

Saranya Koduri

Heroine: పదివేల చీరలు..28 కిలోల బంగారం.. 1250 కిలోల వెండి ఉన్న తెలుగు హీరోయిన్ ఎవరో తెలుసా..!

Saranya Koduri

Parshuram: సినిమా హిట్ అయిన.. ఫ్లాప్ అయినా.. డబ్బు వెనక్కి ఇచ్చేదేలే?.. విలనిజం చూపిస్తున్న పరశురాం..!

Saranya Koduri

Malli Nindu Jabili 2024 Episode 633: శరత్ ని మీరా ని బయటికి పోయి వేరే కాపురం పెట్టమంటున్న వసుంధర..

siddhu