హీరో వేణు అందరికీ సుపరిచితుడే. “స్వయంవరం”, కళ్యాణ రాముడు, హనుమాన్ జంక్షన్, చిరునవ్వుతో, పెళ్ళాం ఊరెళితే.. ఇంకా ఎన్నో ఫ్యామిలీ మరియు కామెడీ సినిమాలతో ప్రేక్షకుల అభిమానాన్ని సంపాదించుకున్నాడు. మొత్తం మీద పాతిక సినిమాలు చేసిన వేణు… మధ్యలో పది సంవత్సరాలు పాటు సినిమా ఇండస్ట్రీకి దూరమయ్యాడు. అయితే మళ్ళీ ఇప్పుడు రవితేజ నటించిన “రామారావు ఆన్ డ్యూటీ” సినిమాతో రీఎంట్రీ ఇవ్వడం జరిగింది. ఈ సినిమాలో పోలీస్ ఆఫీసర్ పాత్రలో వేణు కనిపిస్తున్నాడు. అయితే ఈ సినిమా త్వరలో విడుదల కానున్న నేపథ్యంలో సినిమాకి సంబంధించి ప్రమోషన్ కార్యక్రమంలో వేణు కూడా పాల్గొంటున్నారు.
వరుస ఇంటర్వ్యూలతో… సినిమాకి సంబంధించి ఇంకా తన వ్యక్తిగత కెరియర్ విషయానికి సంబంధించి కొన్ని విషయాలు తెలియజేస్తున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో వేణు మాట్లాడుతూ ఇండస్ట్రీకి పది సంవత్సరాలు దూరం అవడానికి గల కారణం ఏంటో తెలియజేశారు. ఇండస్ట్రీలో తనకి అంతగా పరిచయాలు లేకపోవడం వల్ల.. తాను సినిమాలకు దూరమైనట్లు వేణు పేర్కొన్నారు. ఇదిలా ఉంటే ఇప్పుడు “రామారావు ఆన్ డ్యూటీ” సినిమాతో వేణుకి ఇండస్ట్రీలో పలు అవకాశాలు వస్తున్నట్లు సమాచారం. శరత్ మాండవ దర్శకత్వంలో జరదెక్కిన ఈ సినిమాలో రవితేజ కలెక్టర్ పాత్రలో కనిపిస్తున్నారు.
ఇదే సినిమాలో వేణు పోలీస్ ఆఫీసర్ పాత్ర చేయటం జరిగింది. అయితే కామెడీ తరహా ట్రాక్ లోనే వేణు.. ఈ సినిమాలో నటిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. జులై 29వ తారీకు ఈ సినిమా విడుదల కానుంది. ఇప్పటికే సినిమాకి సంబంధించి విడుదలైన పాటలు మంచి ఆదరణ దక్కించుకున్నాయి. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్.. ఆర్ టి టీం వర్క్స్ బ్యానర్ లాపై సుధాకర్ చెరుకూరి తో కలిసి రవితేజ స్వీయ నిర్మాణంలో ఈ సినిమాని తలకెక్కించారు. రవితేజ కి జోడిగా దివ్యాంక కౌశిక్, రాజీష విజయన్ హీరోయిన్ లుగా నటించడం జరిగింది.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!