NewsOrbit
Entertainment News సినిమా

Salaar: “సలార్” రిలీజ్ డేట్ విషయంలో క్లారిటీ ఇచ్చిన మేకర్స్..!!

Share

Salaar: పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం మూడు సినిమా షూటింగ్స్ లో ఫుల్ బిజీగా ఉన్నారు. ఇదిలా ఉంటే జూన్ 16వ తారీకు “ఆదిపురుష్” విడుదల కానున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించి విడుదలైన ట్రైలర్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. గ్రాఫిక్స్ మరియు డైలాగ్స్ విజువల్ ఎఫెక్ట్స్… హై క్వాలిటీ లో ఉండటంతో అంచనాలు ఓ రేంజ్ లో ఏర్పడ్డాయి. త్వరలోనే దేశవ్యాప్తంగా విడుదల కాబోయే భాషలలో ప్రీ రిలీజ్ ఈవెంట్ లు నిర్వహించబోతున్నారు.

The makers have given clarity on the release date of Salaar

తెలుగులో వచ్చేసరికి తిరుపతిలో “ఆదిపురుష్” ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమా విడుదలైన రెండు నెలల తర్వాత “సలార్” రిలీజ్ కాబోతున్న సంగతి తెలిసిందే. ఆల్రెడీ అంతకుముందు విడుదల తేదీ కూడా ప్రకటించడం జరిగింది. సెప్టెంబర్ 28వ తారీకు “సలార్” రిలీజ్ చేయబోతున్నట్లు స్పష్టం చేశారు. అయితే ఇటీవల “సలార్” రిలీజ్ డేట్ లో మార్పులు చోటు చేసుకున్నాయి అని సోషల్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. దీంతో చిత్ర నిర్మాణ సంస్థ హోంబలే స్పందించింది.

The makers have given clarity on the release date of Salaar

“సలార్” రిలీజ్ లో ఎటువంటి మార్పు లేదని స్పష్టం చేయడం జరిగింది. గతంలో చెప్పినట్టుగానే సెప్టెంబర్ 28వ తారీకు… విడుదల చేస్తున్నట్లు క్లారిటీ ఇచ్చారు. “కేజిఎఫ్” దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ప్రభాస్ చాలా పవర్ ఫుల్ రోల్ లో కనిపించబోతున్నాడు. ఈ సినిమాలో ప్రభాస్ కి జోడిగా శృతిహాసన్ నటించింది. “కేజిఎఫ్” సినిమాకి మించి ఈ సినిమాలో హీరోయిజం ఉండబోతుందని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. “బాహుబలి” తర్వాత ఆ స్థాయిలో ప్రభాస్ హిట్ కొట్టలేకపోయారు. సాహో, రాదేశ్యం భారీ అంచనాల మధ్య విడుదలై పరాజయాలు అయ్యాయి. అయితే “కేజిఎఫ్” సినిమాలతో ఇండియన్ బాక్సాఫీస్ లను ప్రశాంత్ నీల్ షేక్ చేయటంతో “సలార్” పై ప్రభాస్ ఫ్యాన్స్ బోలెడన్ని ఆశలు పెట్టుకున్నారు.


Share

Related posts

Satyameva Jayathe : పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న వకీల్ సాబ్ మూవీ లేటెస్ట్ అప్ డేట్ వచ్చేసింది..

bharani jella

దెయ్యం పాత్ర‌లో జాన్వీ

Siva Prasad

Intinti Gruhalakshmi: తులసి, సామ్రాట్ ను విడగొట్టటానికి లాస్య అదిరిపోయే స్కెచ్..!

bharani jella