Unstoppable 2: ఆహా “అన్ స్టాపబుల్” టాకీ షో మంచి క్రేజ్ తో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. బాలకృష్ణ ఫస్ట్ టైం హోస్ట్ గా అదరగొట్టేస్తున్నాడు. సెలబ్రిటీలను అడిగే ప్రశ్నలతో చేసే కామెడీ.. వాళ్ళిచ్చే సమాధానాలు వీక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. మొదటి సీజన్ తోనే ఈషో అందరి చూపును ఆకర్షించింది. చాలామంది పెద్ద సెలబ్రిటీలు మహేష్ బాబు, అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ, నాని, రవితేజ ఇంకా చాలామంది దర్శకులు హీరోలు నిర్మాతలు వచ్చారు. దీంతో సెకండ్ సీజన్ మొదటి సీజన్ కంటే మరింత గ్రాండ్ గా ఉండాలని.. ఇంకా పెద్ద సెలబ్రిటీలతో పాటు రాజకీయ నాయకులను తీసుకొస్తున్నారు.

ఇప్పటికే మాజీ సీఎంలు చంద్రబాబు ఇంకా కిరణ్ కుమార్ రెడ్డి పలువురు రాజకీయ నాయకులు రావడం జరిగింది. ఇక బిగ్గెస్ట్ స్టార్లు విషయానికొస్తే ప్రభాస్ రావడం జరిగింది. ఈనెల 30వ తారీకు ప్రభాస్ ఎపిసోడ్ స్ట్రీమింగ్ కానుంది. అయితే సెకండ్ సీజన్ చివరికి వస్తున్న క్రమంలో మరొక బిగ్గెస్ట్ స్టార్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ “అన్ స్టాపబుల్” షోకి వస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ షూటింగ్ ఈరోజు జరుగుతుంది. ఈ క్రమంలో అల్లు అరవింద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అన్ స్టాపబుల్ షోకి పవన్ కళ్యాణ్ రావడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. ఇప్పుడు జరగబోయేది వన్ ఆఫ్ ది బెస్ట్ ఎపిసోడ్ అని పేర్కొన్నారు. పవన్ ఈ షో ని సపోర్ట్ చేయటం చాలా సంతోషాన్ని కలిగిస్తుందని స్పష్టం చేశారు.

“అన్ స్టాపబుల్” షో స్టార్ట్ చేయకముందు… ఒక మంచి షో అవుతుందని అనుకున్నాము. కానీ ఇండియాలో అనీ టాకీ షో లలో నెంబర్ వన్ అవుతుందని అసలు ఊహించలేదు. “అన్ స్టాపబుల్” ఇండియాస్ బిగ్గెస్ట్ టాకీ షో. ప్రతి ఒక్కరూ కచ్చితంగా చూడాల్సిన షో మరియు ఎపిసోడ్స్. పవన్…బాలయ్య ది బిగ్గెస్ట్ “అన్ స్టాపబుల్” ఎపిసోడ్ అని అల్లు అరవింద్ చెప్పుకొచ్చారు. ఈరోజు ఎపిసోడ్ షూటింగ్ నేపథ్యంలో… షూటింగ్ జరిగే ప్రాంతం వద్ద నందమూరి మరియు పవన్ అభిమానులు భారీ ఎత్తున రావడం జరిగింది. ఆహా టీం… పిఎస్పీకే విత్ ఎన్.బి.కె అనే హోర్డింగ్స్ పెట్టి షూటింగ్ జరిగే ప్రాంగణం మొత్తం.. పవన్ బాలయ్య ఫోటోలతో నింపేశారు. మరి ఈ షోలో పవన్ కళ్యాణ్ ని బాలకృష్ణ ఎటువంటి ప్రశ్నలు వేస్తారు అన్నది ఆసక్తికరంగా ఉంది.