Vijay Deverakonda: సాదాసీదా హీరోగా ప్రయాణం స్టార్ట్ చేసిన విజయ్ దేవరకొండ “అర్జున్ రెడ్డి”తో ఓవర్ నైట్ లోనే స్టార్ హీరో అయిపోయాడు. అనంతరం చేసిన “గీత గోవిందం” సినిమా తో అమ్మాయిలలో తిరుగులేని ఫాలోయింగ్ సంపాదించుకోవడం జరిగింది. అయితే ఆ తర్వాత విజయ్ దేవరకొండ నటించిన సినిమాలు దాదాపు బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడటం జరిగాయి. ఇటువంటి పరిస్థితుల్లో ప్రస్తుతం డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో “లైగర్” అనే పాన్ ఇండియా సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ మొత్తం ఇటీవల కంప్లీట్ అయింది.
చిన్నపాటి ప్యాచ్ వర్క్ లు మినహా మిగతా … షూటింగ్ మొత్తం కంప్లీట్ కావడంతో ఆగస్టు మాసంలో ఈ సినిమా రిలీజ్ చేయనున్నట్లు టాక్. అయితే ఈ సినిమా ద్వారా మళ్లీ పూరీ జగన్నాథ్ డ్రీమ్ ప్రాజెక్టు “జనగణమన”లో విజయ్ దేవరకొండ.. నటించడానికి రెడీ అయినట్లు ఇటీవల వార్తలు వచ్చాయి. అదే ఈ ప్రాజెక్టు తర్వాత మళ్లీ విజయ్ దేవరకొండ ఆప్ కమింగ్ డైరెక్టర్ లిస్ట్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. పూరితో తర్వాత సుకుమార్, త్రివిక్రమ్ శ్రీనివాస్, కొరటాల శివ తో పాటు శివ నిర్వాణ డైరెక్టర్లతో బిజీ షెడ్యూల్ దాదాపు ఏడు సంవత్సరాల పాటు విజయ్ దేవరకొండ వరుసపెట్టి సినిమాలను ఒప్పుకున్నట్లు ఇండస్ట్రీలో టాక్.
వీటిలో కనీసం మూడు బ్లాక్ బస్టర్ లు అడిగితే మనోడి క్రేజ్ ఇంకా తిరుగులేని రీతిలో బౌన్స్ బ్యాక్ అవుతుందని తాజా వార్త పై సినీ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. కాగా వరస ఫ్లాపుల్లో ఉన్న విజయ్ దేవరకొండ .. పూరి “లైగర్” ప్రాజెక్టుపై చాలా ఆశలు పెట్టుకున్నాడు. సినిమాలో ఇంటర్నేషనల్ బాక్సర్ గా విజయ్ దేవరకొండ.. కనిపిస్తుండగా వరల్డ్ బాక్సింగ్ చాంపియన్ మైక్ టైసన్ కూడా కీలక పాత్ర పోషిస్తున్నాడు. చాయ్ వాలా నుండి ఇంటర్నేషనల్ బాక్సర్ గా విజయ్ దేవరకొండ అని పూరి జగన్నాథ్ చూపించనున్నారు.
Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!