Vijay Deverakonda: కెరియర్ పరంగా విజయ్ దేవరకొండ ప్రస్తుతం ఇబ్బందులు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఈ రౌడీ హీరో హిట్ చూసి చాలా కాలం అయిపోయింది. దాదాపు మూడు సంవత్సరాల నుండి సరైన సినిమా తనకి పడటం లేదని సతమతమవుతున్నాడు. కెరియర్ ప్రారంభంలో బ్యాక్ టు బ్యాక్ విజయాలు అందుకుని “అర్జున్ రెడ్డి” ఇంకా “గీత గోవిందం” వంటి సినిమాలతో అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ఈ సినిమాలతో ఇంకా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకోగా తర్వాత మెల్లమెల్లగా ఫ్లాపులు పడటంతో.. ప్రస్తుతం మంచి హిట్టు కొట్టడానికి నానా తంటాలు పడుతున్నాడు.
దీనిలో భాగంగా డాషింగ్ డైరెక్టర్ పూరి దర్శకత్వంలో పాన్ ఇండియా నేపథ్యంలో “లైగర్” చేయగా… అట్టర్ ఫ్లాప్ అయ్యింది. ఈ సినిమా కోసం దాదాపు రెండున్నర సంవత్సరాలు పాటు కష్టపడ్డాడు. కానీ మొదటి షోకి ఫలితం దారుణమైన డిజాస్టర్ టాక్ రావటంతో ప్రస్తుతం ఆశలన్నీ “ఖుషి” సినిమాపై పెట్టుకున్నాడు. పరిస్థితి ఇలా ఉంటే ఒకపక్క పరాజయాలు పలకరిస్తున్న మరో పక్క మాత్రం అవకాశాలు ఏ మాత్రం తగ్గటం లేదు ఈ రౌడీ హీరోకి.
దీనిలో భాగంగా ఇప్పుడు ఒక స్టార్ హీరోతో పిరియాడికల్ సినిమా.. చేయడానికి విజయ్ దేవరకొండ రెడీ అయినట్లు వార్తలు వస్తున్నాయి. మేటర్ లోకి వెళితే మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్ తో స్క్రీన్ షేర్ చేసుకోవడానికి విజయ్ దేవరకొండ రెడీ అయినట్లు సమాచారం. నందకిషోర్ దర్శకత్వంలో “వృషభ” సినిమాలో మోహన్ లాల్ కొడుకుగా… విజయ్ దేవరకొండ కనిపించనున్నట్లు ప్రచారం జరుగుతుంది. పిరియాడికల్ డ్రామా నేపథ్యంలో మలయాళంతో పాటు తెలుగులో కూడా చిత్రీకరిస్తున్నట్లు త్వరలోనే అధికారిక ప్రకటన చేయనున్నట్లు సమాచారం.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!