సినిమా

Acharya: ఆ ఇద్ద‌రినీ `ఆచార్య‌` టీమ్ ఎందుకు మ‌ర‌చిపోయింది..ఏకేస్తున్న నెటిజ‌న్స్‌!

Share

Acharya: మెగాస్టార్ చిరంజీవి, ఆయ‌న‌ తనయుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటించిన తాజా చిత్రం `ఆచార్య‌`. కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రాన్ని కొణిదెల ప్రొడక్షన్స్, మాట్ని ఎంటర్టైన్‌మెంట్ బ్యానర్స్ పై నిరంజన్ రెడ్డి నిర్మించారు. ఇందులో చిరు స‌ర‌స‌న కాజ‌ల్ అగ‌ర్వాల్, చ‌ర‌ణ్ కు జోడీగా పూజా హెగ్డే న‌టించారు.

అలాగే రియ‌ల్ హీరో సోనూసూద్ ఇందులో ప‌వ‌ర్ ఫుల్ విల‌న్ క్యారెక్ట‌ర్‌ను పోషించారు. గ‌త ఏడాది చివ‌ర్లో చిత్రీక‌ర‌ణ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఏప్రిల్ 29న గ్రాండ్‌గా విడుద‌ల కాబోతోంది. ఈ నేప‌థ్యంలోనే మేక‌ర్స్ నిన్న హైదరాబాదులోని యూసఫ్ గూడ పోలీస్ గ్రౌండ్స్ లో ఆచార్య ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వ‌హించారు.

ఈ కార్యక్రమానికి చిరంజీవి, రామ్ చ‌ర‌ణ్‌, దర్శకుడు కొరటాల శివ‌, పూజా హెగ్డే, ఇతర యూనిట్ సభ్యులు, బాబీ, మోహన్ రాజా, మెహర్ ర‌మేశ్‌, నిర్మాతలు నిరంజన్ రెడ్డి, డీవీవీ దానయ్య త‌దిత‌రులు హాజరయ్యారు. అలాగే ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి స్పెష‌ల్ గెస్ట్‌గా వ‌చ్చి.. ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను స‌క్సెస్ ఫుల్ చేశారు. అయితే ఈ ఈవెంట్‌లో హీరోలు గానీ, ద‌ర్శ‌క‌నిర్మాత‌లు గానీ సోనూసూద్‌, కాజ‌ల్ అగ‌ర్వాల్ ల గురించి ఒక్క ముక్క కూడా మాట్లాడ‌లేదు.

అస‌లు వారిద్ద‌రి పేర్లే ఎత్త‌లేదు. అర్ధరాత్రి వరకు సాగిన ఈ ఈవెంట్ లో అందరూ భారీ స్పీచ్ లు ఇచ్చినా.. ఎవ్వ‌రూ, ఎక్కడా కాజల్, సోనూసూద్ ల గురించి మాట్లాడ‌క‌పోవ‌డం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. గ‌త కొద్ది రోజుల నుంచీ ఆచార్య‌లో కాజ‌ల్ పాత్ర‌కు ప్రాధాన్య‌త ఉండ‌ద‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. అయితే సోనూసూద్ విల‌న్ రోల్ చేశారు. మ‌రి ఆయ‌న గురించైనా ఎందుకు ప్ర‌స్తావించ‌లేద‌ని నెటిజ‌న్లు ఏకేస్తున్నారు. కొంద‌రైతే కావాల‌నే ఆచార్య టీమ్ కాజ‌ల్‌, సోనూసూద్‌ల‌ను మ‌ర‌చిపోయిందంటూ విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు.


Share

Related posts

Nivisha Amazing Wallpapers

Gallery Desk

రామ్ త‌దుప‌రి చిత్రంగా `రెడ్‌`

Siva Prasad

`ఆప‌రేష‌న్ గోల్డ్ ఫిష్` షూటింగ్ పూర్తి

Siva Prasad
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar