KGF 2 – Beast: ఒకే ఒక్కరోజు తేడాతో రెండు భారీ యాక్షన్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద పోటీ పడుతున్నాయి. ఈ నెల 13న బీస్ట్ సినిమా రిలీజ్ కాబోతుండగా 14వ తేదీన కేజీఎఫ్ ఛాప్టర్ 1 సీక్వెల్ రిలీజ్ కాబోతోంది. ఈ రెండు సినిమాలను భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్స్‌గా తెరకెక్కించారు. అయితే, ఇప్పటికే కేజీఎఫ్ 1 వచ్చి అన్నీ భాషల్లోనూ ప్రపంచ వ్యాప్తంగా రిలీజై భారీ సక్సెస్ అందుకుంది. అటు దర్శకుడు ప్రశాంత్ నీల్, ఇటు హీరో యష్‌లకు పాన్ ఇండియన్ స్టార్స్‌గా భారీ స్థాయిలో క్రేజ్ వచ్చేసింది. దాంతో ఇప్పుడు రూపొందిన కేజీఎఫ్ సీక్వెల్ సినిమాపై అసాధారణమైన అంచనాలు నెలకొన్నాయి.
దానికితోడు బాలీవుడ్ స్టార్స్ సంజయ్ దత్, రవీనా టాండన్, సౌత్ స్టార్స్ జగపతి బాబు, రావు రమేశ్ లాంటి వారు కీలక పాత్రల్లో నటించారు. ఇక గత ఏడాది వచ్చిన టీజర్ భారీ స్థాయిలో అంచనాలను పెంచేసింది. అయితే, కోలీవుడ్ స్టార్ హీరో గత కొన్నేళ్ళుగా వరుస విజయాలతో మంచి ఊపు మీదున్నాడు. దానికి తోడు గత చిత్రం మాస్టర్ కూడా పాన్ ఇండియన్ రేంజ్లో బ్లాక్ బస్టర్ సాధించింది. దాంతో విజయ్ కొత్త సినిమాల మీద భారీ అంచనాలు క్రేజ్ నెలకొంది. ఇక సన్ పిక్చర్స్ భారీ బడ్జెట్‌తో కళానిధి మారణ్ నిర్మించిన ఈ సినిమా నుంచి ఇప్పటికే వచ్చిన అరబిక్ కుత్తు సాంగ్ అలాగే మరో సాంగ్ అంచనాలను బాగా పెంచాయి.
KGF 2 – Beast: ఈ నెల 13, 14 వ తేదీల వరకు ఆగాల్సిందే.
పూజా హెగ్డే గ్లామర్ ఈ సినిమాకు మరో అదనపు ఆకర్షణగా నిలవబోతోంది. అయితే, ఇప్పటికే కేజీఎఫ్ 1 వచ్చి ఉండటంతో విజయ్ బీస్ట్ సినిమాతో పోల్చుకుంటే రెట్టింపు అంచనాలు కేజీఎఫ్ సీక్వెల్ సినిమా మీదే ఉండటం ఆసక్తికరమైన విషయం. బిజినెస్ పరంగా కూడా బీస్ట్ కంటే కూడా కేజీఎఫ్ 2 చిత్రానికే ఎక్కువగా జరిగినట్టు తెలుస్తోంది. దాంతో బీస్ట్ సినిమా గనక ఏమాత్రం కథ కథనాల పరంగా తేడా కొట్టినా గ్యారెంటీగా కేజీఎఫ్ 2 కొట్టేస్తుందని సౌత్‌లో ట్రేడ్ వర్గాలు మాట్లాడుకుంటున్నారు. చూడాలి మరి ఈ రెండు సినిమాలలో ఏది బాక్సాఫీస్ వద్ద కొత్త రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో. అది తెలియాలంటే ఈ నెల 13, 14 వ తేదీల వరకు ఆగాల్సిందే.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!