Sharwanand: టాలీవుడ్‌లో టాలెంటెడ్ హీరోగా శర్వానంద్‌కు చాలా మంచి పేరుంది. వెరైటీ కాన్సెప్ట్స్ ఎంచుకుంటూ మంచి మార్కెట్‌ను సంపాదించుకున్నాడు. బాక్సాఫీస్ వద్ద తన సినిమాలు మినిమమ్ గ్యారెంటీ అనే టాక్ రావడంతో నిర్మాతలు వరుసగా సినిమాలు చేస్తున్నారు. ఒకదశలో శర్వా సినిమా అంటే అన్నీ వర్గాల ప్రేక్షకులను అలరిస్తాయని ప్రేక్షకులే కాదు ఇండస్ట్రీ వర్గాలు ఫిక్సైయ్యారు. కొన్నాళ్ళు తన సినిమాలు అలానే అలరించాయి. అందుకు ఉదాహరణ శతమానం భవతి సినిమా. ఈ సినిమాతో శర్వా ఫ్యామిలీ హీరోగా భారీగా క్రేజ్ సంపాదించుకున్నాడు. అయితే ఈ సినిమా తర్వాత మాస్ హీరో ఇమేజ్ కోసం ట్రై చేసి శర్వా దెబ్బ తిన్నాడు.

రణరంగం, పడి పడి లేచేమనసు సినిమాలు చేసి ఫ్లాప్స్ మూటగట్టుకున్నాడు. ఆ తర్వాత తమిళ హిట్ సినిమా 96 తెలుగు రీమేక్ జానులో నటించాడు. ఈ సినిమా కూడా ఫ్లాప్‌గా నిలిచింది. శతమానం భవతి లాంటి హిట్ అందుకోవాలని శ్రీకారం సినిమా చేశాడు. ఈ సినిమాకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. కానీ, అప్పటికే ఈ తరహా కాన్సెప్ట్స్ చాలా వచ్చాయి కాబట్టి సినిమా కమర్షియల్‌గా సక్సెస్ సాధించలేదు. ఇక టాలీవుడ్ హీరోలు రిజెక్ట్ చేసిన మహా సముద్రం సినిమాతో హిట్ అందుకోవాలనే ఆశతో చేసి మరోసారి డిజాస్టర్‌ను నెత్తిన పెట్టుకున్నాడు.
Sharwanand: టీజర్ చూస్తే శర్వాకు ఈసారి మంచి హిట్ దక్కుతుందని చెప్పుకుంటున్నారు.
ఇప్పుడు శర్వా రెండు సినిమాలు చేస్తున్నాడు. వాటిలో ఒకటి వెంకటేశ్ చేసే సినిమాల తరహాలో వస్తున్న ఆడవాళ్ళు మీకు జోహార్లు. రష్మిక మందన్న హీరోయిన్. ఇక శర్వానంద్ – వెన్నెల కిషోర్ – ప్రియదర్శి కలిసి నటిస్తున్న సినిమా ఒకే ఒక జీవితం. అక్కినేని అమల కీలక పాత్రలో కనిపించబోతున్నారు. టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్‌తో ఈ సినిమా తెరకెక్కుతుండగా, తాజాగా ఈ సినిమా టీజర్ రిలీజై ప్రేక్షకులని బాగా ఆకట్టుకుంటోంది. టీజర్ వరకు చూస్తే శర్వాకు ఈసారి మంచి హిట్ దక్కుతుందని చెప్పుకుంటున్నారు. చూడాలి మరి ఈసారేమవుతుందో. కాగా, ఈ సినిమా వచ్చే ఏడాది ప్రథమార్థంలో విడుదల కానుంది. కొత్త దర్శకుడు శ్రీ కార్తిక్ రూపొందిస్తున్న ఈ సినిమాను డ్రీమ్ వారియర్ పిక్చర్ నిర్మిస్తోంది.