NewsOrbit
న్యూస్ సినిమా

Sharwanand: కొత్త కాన్సెప్ట్ కథ శర్వానంద్‌కు హిట్ ఇస్తుందా..ఏం చేసినా షాకే తగులుతోంది..!

Sharwanand: టాలీవుడ్‌లో టాలెంటెడ్ హీరోగా శర్వానంద్‌కు చాలా మంచి పేరుంది. వెరైటీ కాన్సెప్ట్స్ ఎంచుకుంటూ మంచి మార్కెట్‌ను సంపాదించుకున్నాడు. బాక్సాఫీస్ వద్ద తన సినిమాలు మినిమమ్ గ్యారెంటీ అనే టాక్ రావడంతో నిర్మాతలు వరుసగా సినిమాలు చేస్తున్నారు. ఒకదశలో శర్వా సినిమా అంటే అన్నీ వర్గాల ప్రేక్షకులను అలరిస్తాయని ప్రేక్షకులే కాదు ఇండస్ట్రీ వర్గాలు ఫిక్సైయ్యారు. కొన్నాళ్ళు తన సినిమాలు అలానే అలరించాయి. అందుకు ఉదాహరణ శతమానం భవతి సినిమా. ఈ సినిమాతో శర్వా ఫ్యామిలీ హీరోగా భారీగా క్రేజ్ సంపాదించుకున్నాడు. అయితే ఈ సినిమా తర్వాత మాస్ హీరో ఇమేజ్ కోసం ట్రై చేసి శర్వా దెబ్బ తిన్నాడు.

will new concept give hit to sharwanand
will new concept give hit to sharwanand

రణరంగం, పడి పడి లేచేమనసు సినిమాలు చేసి ఫ్లాప్స్ మూటగట్టుకున్నాడు. ఆ తర్వాత తమిళ హిట్ సినిమా 96 తెలుగు రీమేక్ జానులో నటించాడు. ఈ సినిమా కూడా ఫ్లాప్‌గా నిలిచింది. శతమానం భవతి లాంటి హిట్ అందుకోవాలని శ్రీకారం సినిమా చేశాడు. ఈ సినిమాకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. కానీ, అప్పటికే ఈ తరహా కాన్సెప్ట్స్ చాలా వచ్చాయి కాబట్టి సినిమా కమర్షియల్‌గా సక్సెస్ సాధించలేదు. ఇక టాలీవుడ్ హీరోలు రిజెక్ట్ చేసిన మహా సముద్రం సినిమాతో హిట్ అందుకోవాలనే ఆశతో చేసి మరోసారి డిజాస్టర్‌ను నెత్తిన పెట్టుకున్నాడు.

Sharwanand: టీజర్ చూస్తే శర్వాకు ఈసారి మంచి హిట్ దక్కుతుందని చెప్పుకుంటున్నారు.

ఇప్పుడు శర్వా రెండు సినిమాలు చేస్తున్నాడు. వాటిలో ఒకటి వెంకటేశ్ చేసే సినిమాల తరహాలో వస్తున్న ఆడవాళ్ళు మీకు జోహార్లు. రష్మిక మందన్న హీరోయిన్. ఇక శర్వానంద్ – వెన్నెల కిషోర్ – ప్రియదర్శి కలిసి నటిస్తున్న సినిమా ఒకే ఒక జీవితం. అక్కినేని అమల కీలక పాత్రలో కనిపించబోతున్నారు. టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్‌తో ఈ సినిమా తెరకెక్కుతుండగా, తాజాగా ఈ సినిమా టీజర్ రిలీజై ప్రేక్షకులని బాగా ఆకట్టుకుంటోంది. టీజర్ వరకు చూస్తే శర్వాకు ఈసారి మంచి హిట్ దక్కుతుందని చెప్పుకుంటున్నారు. చూడాలి మరి ఈసారేమవుతుందో. కాగా, ఈ సినిమా వచ్చే ఏడాది ప్రథమార్థంలో విడుదల కానుంది. కొత్త దర్శకుడు శ్రీ కార్తిక్ రూపొందిస్తున్న ఈ సినిమాను డ్రీమ్ వారియర్ పిక్చర్ నిర్మిస్తోంది.

Related posts

Breaking: ఇరాన్ అధ్యక్షుడి హెలికాఫ్టర్ కు ప్రమాదం..!

sharma somaraju

YSRCP: వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లుపై కేసు నమోదు

sharma somaraju

Human Trafficking Rocket: హ్యూమన్ ట్రాఫికింగ్ ముఠా గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు ..లక్షల్లో జీతాలంటూ విదేశాలకు యువకుల తరలింపు

sharma somaraju

Pavitra Jayaram: ప్లీజ్ అలా మాట్లాడకండి.. పవిత్ర జయరాం కూతురు ఎమోషనల్ కామెంట్స్..!

Saranya Koduri

OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న అభినవ్ గోమఠం కామెడీ మూవీ.. మరో మైలురాయి దాటేసిందిగా..!

Saranya Koduri

Padamati Sandhya Ragam: నేను చేసే ఆ పనిని భరిస్తాడు.. అందుకే అతను నాకు ఇష్టం.. సంధ్య ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Small Screen: గృహప్రవేశం చేసుకున్న బుల్లితెర నటి.. వీడియో వైరల్..!

Saranya Koduri

Chandu: సీరియల్ ని మించిన ట్విస్టులు.. ఇద్దరి పెళ్ళాల ముద్దుల మొగుడు చందు లవ్ స్టోరీ..!

Saranya Koduri

Shobha Shetty: అవకాశాలు లేక.. పైట చెంగు జార వేస్తున్న శోభా శెట్టి..!

Saranya Koduri

JD Lakshminarayana: జగన్ విదేశీ పర్యటనపై జేడీ లక్ష్మీనారాయణ కీలక కామెంట్స్

sharma somaraju

TS Cabinet Meeting: తెలంగాణ కేబినెట్ భేటీకి ఈసీ గ్రీన్ సిగ్నల్ .. కానీ..

sharma somaraju

ముగ్గురు ట్రాన్స్ జెండర్లు అనుమానాస్పద మృతి

sharma somaraju

Arvind Kejrival: ఢిల్లీలో ఆప్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత .. రోడ్డుపై భైటాయించిన సీఎం కేజ్రీవాల్.. బీజేపీపై తీవ్ర వ్యాఖ్యలు

sharma somaraju

NTR: కెరీర్ మొత్తంలో జూ. ఎన్టీఆర్ ను బాగా బాధ‌పెట్టిన మూడు సినిమాలు ఇవే!

kavya N

Allu Arjun: మెగా ఫ్యామిలీకి ఊహించ‌ని షాకిచ్చిన అల్లు అర్జున్‌.. ఆ గ్రూప్ నుంచి ఎగ్జిట్‌..?!

kavya N