coconut oil : కొబ్బరి నూనె వాడి చేసే మర్దన తో సిపిల్లలకు కలిగే కొన్నిప్రయోజనాలను తెలుసుకుందాం.
ప్రతి రాత్రి బిడ్డ పుట్టిన తోలి రోజుల్లో తలమీద, చర్మం పై చుండ్రు లాగా పొరలుపొరలుగా ఊడి వస్తుంటుంది.
కాస్త కొబ్బరి నూనె తీసుకుని తల మీద తేలికపాటి మసాజ్ చేస్తే ఈ సమస్య తగ్గుతుంది. ఈ నూనెను తలపై 20
నిమిషాల పాటు అలాగే వదిలేసి తర్వాతా గోరువెచ్చని నీటితో శుభ్రం చేయాలి.
ప్రతి రాత్రి మీ శిశువు జుట్టుకు కొంచెం కొబ్బరి నూనె రాసినట్లయితే జుట్టు అందంగా మెరుస్తూ ఉంటుంది.
పిల్లల చర్మం పొడిగా ఉండి దురద ను కలిగి ఉండటాన్ని తామర అని పిలుస్తారు. కొబ్బరి నూనెతో మసాజ్
చేస్తే తామర ను తగ్గిస్తుంది.
coconut oil : మృదువుగా,తేమగా
పిల్లలకు డైపర్ వలన దద్దుర్లు వచ్చినప్పుడు కొబ్బరినూనె రాస్తే బాగా పనిచేస్తుంది. ఈ చలికాలం లో పసి పిల్లల పగిలిన పెదవులకు కాస్త కొబ్బరి నూనెను రాస్తూ ఉండాలి. దోమలు కుట్టి దద్దురులు వచ్చిన చోట కొబ్బరి నూనె రాస్తే కొబ్బరినూనె లోని యాంటీబ్యాక్టీరియల్ మరియు యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు దద్దుర్లు తగ్గిస్తాయి. ఇంట్లో ఎవరి తలలో అయినా పేలు ఉంటే పసి బిడ్డలకు కూడా వచ్చే అవకాశం ఉంది. కొబ్బరినూనె రాయడం వలన పేలు పెరగ కుండా ఉంటాయి. కొబ్బరి నూనెను చిగుళ్లపై రాస్తూ ఉంటే దంతాలు నొప్పి తగ్గడానికి సహాయపడుతుంది. ఎందుకంటే ఇది యాంటీ-
ఇన్ఫ్లమేటరీ అవడం వలన చిగుర్ల మంటను తగ్గిస్తుంది.
బిడ్డ చిగుళ్లపై
మర్దన చేయండి. ఇలా చేయడం వలన చిగుళ్లు దృఢం గా ఉండటం తో పాటు నొప్పి కూడా తగ్గుతుంది.
కొబ్బరి నూనె చాలా తేలికైనది అవడం తో శరీరం కూడా తేలికగా దీన్ని గ్రహిస్తుంది. అందుకే దీనిని బాడీ లోషన్ గా కూడా
వాడవచ్చు.