Sai Manjrekar: పాత నీరు పోవాలి..కొత్త నీరు రావాలి అనే సామెత మాదిరిగా ఇండస్ట్రీకి కొంత పాత పడిన మొహాలను మెల్లగ పక్కన పెట్టి కొత్త మొహాలను తీసుకొస్తుంటారు దర్శక, నిర్మాతలు. జనాలకు ఏం కావాలో అది ఇచ్చే బాధ్యత దర్శకుడిది. అందుకే చాలా తక్కువ సినిమాలలోనే రిపిటెడ్ హీరోయిన్స్ కనిపిస్తుంటారు. చూసిన హీరోయిన్ను మళ్ళీ చూడాలంటే ఇప్పుడు అంత ఆసక్తి చూపిస్తున్న వారు లేరనే చెప్పాలి. ఎక్స్‌ఫోజింగ్, ఎక్స్ట్రా పర్ఫార్మెన్స్తో ఆకట్టుకుంటే తప్ప హీరోయిన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవడం లేదు. ప్రతీ సినిమాకి ఓ కొత్త హీరోయిన్ను పరిచయం చేసే దర్శకులలో పూరి జగన్నాథ్ ముందుంటారు.
ఇక మన టాలీవుడ్లో ఎక్కువగా సత్తా చాటుతుంది బాలీవుడ్ యంగ్ బ్యూటీస్, క్రేజీ హీరోయిన్స్..మోడల్సే. ముంబై నుంచి ఇక్కడికి వచ్చి స్టార్ డమ్ సంపాదించుకొని కొంతకాలం ఓ వెలుగు వెలుగుతున్నారు. ఈ ఏడాది ప్రారంభంలో వచ్చిన ఉప్పెన సినిమాతో మొదటి సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమై సాలీడ్ హిట్ అందుకున్న కృతిశెట్టి వెనకాలే ఇప్పుడు హీరోలందరూ క్యూ కడుతున్నారు. మనవాళ్ళకి కావాల్సింది సక్సెస్‌లో ఉన్న హీరోయిన్. ఒకటి రెండు సినిమాలతో హిట్ అందుకుంటే స్వయంగా హీరోలే దర్శక నిర్మాతలకు రికమెండ్ చేస్తుంటారు. అందుకే కృతిశెట్టి చేతిలో ఇప్పుడు అరడజను సినిమాలున్నాయి.
Sai Manjrekar: సాయీ మంజ్రేకర్ కు టాలీవుడ్లో మంచి లైఫ్ ఉంటుంది.
అలాంటి మరో హీరోయిన్ త్వరలో టాలీవుడ్‌కి ఎంట్రీ ఇవ్వబోతోంది. ఆ అమ్మాయే సాయీ మంజ్రేకర్. దర్శక, నటుడు మహేశ్ మంజ్రేకర్ కూతురైన సాయి మంజ్రేకర్ తెలుగులో గని, మేజర్ సినిమాలలో హీరోయిన్గా నటించింది. ఈ రెండు మంచి ప్రాజెక్ట్స్. ఒక ప్రాజెక్ మహేశ్ బాబుది కాగా, మరొకటి మెగా ఫ్యామిలీ హీరో వరుణ్ తేజ్ చేస్తున్నది. వీటిలో ఒక్క సినిమా బ్లాక్ బస్టర్ అయినా గ్యారెంటీగా సాయీ మంజ్రేకర్ కు టాలీవుడ్లో మంచి లైఫ్ ఉంటుంది. ఇప్పటికే బాలీవుడ్లో ఈ బ్యూటీ కండల వీరుడు సల్మాన్
ఖాన్ సరసన దబాంగ్ సిరీస్‌లో నటించి క్రేజ్ సంపాదించుకుంది. మరి తెలుగులో ఏ రేంజ్ క్రేజ్ తెచ్చుకుంటుందో చూడాలి.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!