Today Horoscope: జూలై 5 – సోమవారం – జ్యేష్ట మాసం
మేషం
చేపట్టిన పనులలో కార్యసిద్ధి కలుగుతుంది. ఆప్తుల నుండి కీలక సమాచారం అందుతుంది. వస్తు వాహన లాభాలు అందుకుంటారు. పాత మిత్రులను కలుసుకుని విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. గృహమున శుభ కార్యక్రమాలు నిర్వహిస్తారు. వృత్తి వ్యాపారాలు అనుకూలిస్తాయి ఉద్యోగాలలో ఉన్నత పదువులు పొందుతారు.

వృషభం
బంధు మిత్రులతో మాటపట్టింపులు ఉంటాయి చేపట్టిన వ్యవహారాల్లో అలోచించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది చేపట్టిన పనులు నిదానంగా సాగుతాయి ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది వ్యాపార ఉద్యోగాలు స్వల్పంగా లాభిస్తాయి.
మిధునం
చేపట్టిన పనులు అవరోధాలున్నప్పటికీ సమయానికి పూర్తి చేస్తారు. కుటుంబ విషయాలలో సమస్యలను పరిష్కరించుకుంటారు. రావలసిన బాకీలు వసూలవుతాయి నూతన వాహనం యోగం కలుగుతుంది వ్యాపారాలు అంచనాలకు మించి ఉంటాయి ఉద్యోగ విషయంలో అవరోధాలు అధిగమిస్తారు.
కర్కాటకం
దైవానుగ్రహంతో కొన్ని పనులు పూర్తి చేస్తారు సంఘంలో విశేషమైన గౌరవ మర్యాదలు పెరుగుతాయి. దాయాదులతో స్థిరాస్థి వివాదాలు ఒక కొలిక్కి వస్తాయి. కుటుంబ సభ్యులతో శుభకార్యాల్లో పాల్గొంటారు నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి. ఋణప్రయత్నాలు కలసివస్తాయి.
సింహం
ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. కుటుంబ సభ్యుల నుండి ఒత్తిడి పెరిగుతుంది. దైవ సంబంధ విషయాలపై దృష్టిసారిస్తారు. ఒక విషయంలో శారీరక మానసికంగా ప్రశాంతంగా లోపిస్తుంది. చేపట్టిన పనులు లో జాప్యం కలుగుతుంది. వ్యాపార వ్యవహారాలు మందగిస్తాయి వృత్తి ఉద్యోగాలలో స్థానచలన సూచనలున్నవి.
కన్య
చేపట్టిన పనులలో ఆటంకాలు ఉంటాయి ఇంట బయట ఒత్తిడి పెరుగుతుంది. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు సోదరుల నుండి ఊహించని మాటలు వినవలసి వస్తుంది. వృత్తి వ్యాపారాలలో భాగస్వాములతో మాటపట్టింపులు కలుగుతాయి. నిరుద్యోగ ప్రయత్నాలు నిరాశ కలిగిస్తాయి. ఉద్యోగమున అదనపు బాధ్యతలుంటాయి.
తుల
ప్రముఖులతో చర్చలు అనుకూలిస్తాయి. నిరుద్యోగులు శుభవార్తలు అందుకుంటారు నూతన వాహనం కొనుగోలు చేస్తారు. కుటుంబ సభ్యులతో గృహమున సంతోషంగా గడుపుతారు. జీవిత భాగస్వామి సహాయ సహకారాలతో కొన్ని పనులు పూర్తిచేస్తారు వృత్తి ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుకుంటారు.
వృశ్చికం
ఆర్థికంగా పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది అవసరానికి ఆప్తుల నుండి సహాయ సహకారాలు అందుతాయి వృత్తి వ్యాపారాలలో స్వంత ఆలోచనలను ఆచరణలో పెట్టి లాభాలు పొందుతారు. సంఘంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. ఉద్యోగ విషయంలో మీ సమర్థతను చాటుకుంటారు.నిరుద్యోగుల ప్రయత్నాలు ఫలిస్తాయి.
ధనస్సు
బంధువుల నుండి ఊహించని సమస్యలు ఎదురవుతాయి. వాహన ప్రయాణ విషయంలో జాగ్రత్త వహించాలి. కుటుంబ వాతావరణం సమస్యాత్మకంగా ఉంటుంది. వృధా ఖర్చులు పెరుగుతాయి. వ్యాపారపరంగా తొందరపాటు నిర్ణయాలు చెయ్యడం మంచిది కాదు .ఉద్యోగమున అదనపు బాధ్యతలు వలన విశ్రాంతి ఉండదు.
మకరం
చేపట్టినపనులు వ్యయ ప్రయాసలతో కాని పూర్తి కావు బంధుమిత్రులతో ఊహించని వివాదాలు కలుగుతాయి నూతన వ్యాపార పెట్టుబడులు విషయంలో పునరాలోచన చెయ్యడం మంచిది. ఆర్థిక విషయాలలో నిరాశ తప్పదు ఉద్యోగ విషయమై అధికారులతో వివాదాలకు దిగడం మంచిది కాదు.
కుంభం
చేపట్టిన పనులు అప్రయత్నంగా పూర్తవుతాయి. గృహమున మీ మాటకు విలువ పెరుగుతుంది. ప్రయాణాలలో నూతన పరిచయాలు పెరుగుతాయి స్థిరాస్తి లబ్ది పొందుతారు. వ్యాపార వ్యవహారాలలో విజయం సాదిస్తారు. భూ సంభందిత క్రయవిక్రయాలలో అనుకూలత పెరుగుతుంది. దైవ కార్యక్రమాలలో పాల్గొంటారు.
మీనం
కుటుంబ సభ్యుల ప్రవర్తన కొంత చికాకు కలిగిస్తాయి ఆర్థిక వ్యవహారాలు కొంత అనుకూలిస్తాయి. చేపట్టిన పనులు నిదానంగా. ముఖ్యమైన వ్యవహారాలు వాయిదా వేయడం మంచిది. వృత్తి ఉద్యోగాలలో అధికారులతో సమస్యలు కలుగుతాయి. వ్యాపారమున పెట్టుబడుల విషయంలో తొందరపాటు మంచిది కాదు.
నిత్ర రాశి ఫలాలు యాప్ సౌజన్యంతో…