NewsOrbit
Featured దైవం న్యూస్

Today Horoscope జనవరి -14- గురువారం ఈరోజు రాశి ఫలాలు.

Today Horoscope డిసెంబర్ 6 ఆదివారం రాశి ఫలాలు

జనవరి – 14 – సంక్రాంతి – గురువారం – పుష్య మాసం. ఈరోజు ఉత్తరాయణ పుణ్యకాలం. మీరు దానధర్మాలు, పెద్దలకు తర్పణాలు వదలడం, సూర్యారాధన చేయడం ఉత్తమం. ఈరోజు మంచి ఫలితాలు వస్తాయి.

Today Horoscope డిసెంబర్ 6 ఆదివారం రాశి ఫలాలు

మేష రాశి జనవరి -14- గురువారం ఈరోజు రాశి ఫలాలు.ఈరోజు ఆర్థిక లాభాలు పొందుతారు !

ఈరోజు అనుకూలగా ఉంటుంది. పరువు ప్రతిష్టలకు , సాంప్రదాయాలకు విలువనిస్తారు. సమాజంలో మంచి గౌరవాన్ని పొందుతారు. అందరితో మంచిగా మాట్లాడటం వల్ల అందరూ మిమ్మల్ని ఆకట్టుకుంటారు. శ్రమకు తగ్గ ఫలితం ఉంటుంది. ఏ విషయంలో అయినా మీ సొంతంగా మీరే ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు. డబ్బులు బాగా సంపాదించి అప్పుల బాధలు తీర్చుకుంటారు. ధన వృద్ధి కలుగుతుంది. ఈరోజు వస్తు, వాహనాలను కొనుగోలు చేస్తారు. మీకు దగ్గరలో ఉన్న దేవాలయానికి వెళ్లి దైవదర్శనం చేసుకుంటారు. ఆధ్యాత్మిక చింతన ఏర్పడుతుంది. ఈరోజు అనుకున్న పనిని పట్టుదల పట్టి పూర్తి చేస్తారు. విద్యార్థులు బాగా కష్టపడి చదువుకుంటారు.  స్త్రీలు దేవతారాధనకు ప్రాధాన్యతనిస్తారు. మంచి ఆరోగ్యాన్ని కలిగి ఉంటారు. ఈరోజు వ్యాపారాన్ని పెంచుకొని ఆర్థిక లాభాలు పొందుతారు.

 

వృషభ రాశి జనవరి -14- గురువారం ఈరోజు రాశి ఫలాలు.ప్రయాణ విషయంలో జాగ్రత్త !

ఈరోజు కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. ఆర్థిక ఇబ్బంది కలుగుతుంది. ముఖ్యమైన విషయాలో తొందరపడి నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఇబ్బంది కలుగుతుంది. ఈరోజు తక్కువగా మాట్లాడడం మంచిది. కొత్త వ్యక్తులతో వ్యాపార లావాదేవీలు జరుపుతారు. విలువైన పత్రాలు మీద సంతకాలు చేయకుండా ఉండటం మంచిది. అనవసర ఖర్చులకు దూరంగా ఉండండి. ఈరోజు ఆలోచించి మాట్లాడడం మంచిది. ఈ రోజు ప్రయాణం విషయంలో జాగ్రత్తగా ఉండటం మంచిది, వాహనం ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్త. విద్యార్థులు అనవసర విషయాలకు దూరంగా ఉండి చదువు మీద శ్రద్ధ పెట్టడం మంచిది.

 

మిధున రాశి జనవరి -14- గురువారం ఈరోజు రాశి ఫలాలు.ఈరోజు సరైన నిర్ణయం తీసుకుంటారు !

ఈరోజు విలాసవంతంగా, సంతోషంగా ఉంటారు. ఈరోజు ఆచార సాంప్రదాయాలకు, పరువు ప్రతిష్టలకు ప్రాధాన్యతనిస్తారు దంపతులిద్దరూ అన్యోన్యంగా ఉంటారు. అప్పుల బాధలు తీర్చుకుంటారు. వాహనాలను కొనుగోలు చేస్తారూ. ఈరోజు ఏ విషయంలో ఆయన సరైన నిర్ణయం తీసుకుంటారు. ఉద్యోగస్తులు ఆఫీసులో బాగా పనిచేసి పై అధికారులతో మన్ననలను పొందుతారు. విద్యార్థులు వారి స్నేహితులతో పోటీపడి చదువుకుంటారు. వ్యాపార లాభాలు కలుగుతాయి.

 

కర్కాటక రాశి జనవరి -14- గురువారం ఈరోజు రాశి ఫలాలు.ఈరోజు ఉద్యోగస్తులు ఆఫీసులలో జాగ్రత్త !

ఈరోజు మిత్రులు కూడా శత్రువులు అయ్యే అవకాశం ఉంటుంది. గొడవలకు, వాదోపవాదాలకు దూరంగా ఉండడం మంచిది. ఆచార సంప్రదాయాలను వదలకుండా వాటికి విలువ ఇవ్వడం మంచిది. ప్రయాణాలకు అనుకూలమైన రోజు కాదు. ఈరోజు తొందరపడి ఎవరిమీద కోపం పడకుండా, వారితో వెటకారంగా మాట్లాడకుండా ఉండటం మంచిది, మీకే నష్టం జరిగే అవకాశం ఉంటుంది. అనవసరంగా ఇతరుల తప్పులను ఎత్తి చూపకుండా ఉండండి. ఏ విషయంలోనైనా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి, తొందరపడి తీసుకోవడం వల్ల ఇబ్బంది కలుగుతుంది. విద్యార్థులు అనవసర విషయాలకు దూరంగా ఉంది చదువుమీద శ్రద్ధ చూపడం మంచిది. తల్లిదండ్రులను పెద్దవారిని గౌరవించడం మంచిది, వారు చెప్పిన మాటలను వినడం వల్ల బాగుంటుంది. ఈ రోజు అప్పులు చేయడానికి దూరంగా ఉండడం మంచిది ఉద్యోగస్తులు ఆఫీసులలో పై అధికారులతో జాగ్రత్తగా ఉండటం మంచిది. వ్యాపారాల్లో స్వల్ప నష్టాలు ఏర్పడే అవకాశం ఉంటుంది.

 

సింహరాశి జనవరి -14- గురువారం ఈరోజు రాశి ఫలాలు.ఈరోజు బాగా కష్ట పడతారు !

ఈ రోజు బాగుంటుంది. సున్నిత మనస్తత్వం కలిగి ఉంటారు. అందరితో ప్రేమగా మసలు కుంటారు. ఆయన వారి కోసం బాగా కష్ట పడతారు. వాహన కొనుగోలు చేస్తారు. ఏ విషయంలో అయినా సొంతంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు. ఈరోజు నిజాయితీకి ధర్మానికి ప్రాధాన్యతనిస్తారు. విద్యార్థులు బాగా చదువుకొని కొత్త కొత్త ప్రయోగాలు చేస్తారు. ఇంతకుముందు ఉన్న కోపాన్ని ఈరోజు దూరంగా పెడతారు. ఉద్యోగస్తులకు ఇంతకు ముందు కంటే ఈ రోజు పనితీరు బాగుంటుంది.

 

కన్యారాశి జనవరి -14- గురువారం ఈరోజు రాశి ఫలాలు.పని వత్తిడి పెరిగే అవకాశం ఉంది !

ఈరోజు కొంచెం కష్టంగా ఉంటుంది. అప్పుల బాధలు పెరిగే అవకాశం ఉంటుంది. అనవసరపు ఖర్చులకు దూరంగా ఉండటం మంచిది. ధన నష్టం కలిగే అవకాశం ఉంటుంది. తప్పుడు పద్ధతిలో డబ్బులు సంపాదించడానికి దూరంగా ఉండటం మంచిది లేదంటే నష్టం జరిగే అవకాశం ఉంది. తక్కువ మాట్లాడడం మంచిది లేదంట  మీకు ఇష్టమైన వారు దూరం అయ్యే దూరం అయ్యే అవకాశం ఉంది. ప్రయాణాలకు దూరంగా ఉండటం మంచిది. మిత్రులు కూడా శత్రువులు అయ్యే అవకాశం ఉండి, అసలైన మిత్రులు ఎవరు అనేది తెలుసుకుంటారు. ఉద్యోగస్తులకు పని వత్తిడి పెరిగే అవకాశం ఉంటుంది. విద్యార్థులు స్నేహితులకు దూరంగా ఉండి చదువు మీద శ్రద్ధ పెట్టడం మంచిది.

 

 తులారాశి జనవరి -14- గురువారం ఈరోజు రాశి ఫలాలు.ఈరోజు వాహనాలను కొనుగోలు చేస్తారు !

ఈ రోజు బాగుంటుంది. రాబోయే రోజుల కోసం ఆలోచిస్తారు. ఇంతకుముందు నెమ్మదిగా సాగిన పనులు ఈరోజు తొందరగా పూర్తి అయిపోతాయి. మొండి బాకీలు ఈరోజు వసూలు చేసుకొని ధన ప్రాప్తి పొందుతారు. ఈ రోజు ఏ విషయంలో ఆయన ఆలోచించి మంచి నిర్ణయాలు తీసుకుంటారు. ఈరోజు ధర్మానికి నిజాయితీకి ప్రాధాన్యతనిస్తారు. నూతన వస్తు వాహనాలను కొనుగోలు చేస్తారు. ఉద్యోగస్తులకు ఉద్యోగపరంగా అభివృద్ధి చెందుతారు. అన్నదమ్ముల నుంచి శుభవార్తలు వింటారు. విద్యార్థులు బాగా చదువుకొని కొత్త ప్రయోగాలు చేస్తారు. వ్యాపారస్తులు పెట్టుబడులు పెట్టి లాభాలు పొందుతారు.

 

వృశ్చిక రాశి జనవరి -14- గురువారం ఈరోజు రాశి ఫలాలు.ఈరోజు ఆదాయం తక్కువగా ఉంటుంది !

ఈరోజు కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. ఈరోజు ఆదాయం తక్కువ ఖర్చు ఎక్కువగా ఉంటుంది. ధననష్టం జరుగుతుంది. దగ్గర స్నేహితులను దూరం చేసుకునే అవకాశం ఉంది. ఈ రోజు విద్యార్థులు స్నేహితులతో సమయాన్ని గడపకుండా చదువు మీద శ్రద్ధ పెట్టి చదువుకోవడం మంచిది. ఈరోజు ఎవరిని తిట్టకుండా, నిందించకుండా ఉండటం మంచిది. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు ఏర్పడే అవకాశం ఉంటుంది. వ్యాపారం ఆశాజనకంగా ఉంటుంది. వ్యసనాలకు దూరంగా ఉండండి. విలువైన వస్తులను జాగ్రత్తగా చూసుకోవడం మంచిది, ఎక్కడైనా పెట్టి మర్చిపోయే అవకాశం ఉంటుంది.

 

ధనస్సు రాశి జనవరి -14- గురువారం ఈరోజు రాశి ఫలాలు.వ్యాపార వృద్ధి కలుగుతుంది !

ఈ రోజు బాగుంటుంది. అందరితో కలిసి మెలిసి సంతోషంగా ఉంటారు. ఈరోజు అనవసర ఖర్చులకు దూరంగా ఉంటారు. ధన లాభం పొందుతారు. తెలివిగా ఉంటూ ఇతరులతో సమయస్ఫూర్తి గా పని చేయించుకుంటారు. గృహ స్థలాన్ని కొనుగోలు చేస్తారు. ఉద్యోగస్తులకు ఎప్పటి నుంచో  ఎదురుచూసిన అవకాశాలు  ఈరోజు కలిసి వస్తాయి. విద్యార్థులు పెద్దల మాటలను ఆచరణలో పెడుతూ చదువుమీద శ్రద్ధ చూపుతారు. వస్తు లాభాం కలుగుతుంది. వ్యాపార వృద్ధి కలుగుతుంది.

 

మకర రాశి జనవరి -14- గురువారం ఈరోజు రాశి ఫలాలు.ఈరోజు స్వల్ప లాభాలు కలుగుతాయి !

ఈరోజు కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. మీలో ఉన్న ఆత్మ విశ్వాసం తగ్గిపోయి మానసిక ఒత్తిడికి గురవుతారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం మంచిది, అనారోగ్య సమస్యలు ఏర్పడే అవకాశం ఉంది. ఏ విషయంలో ఆయన తొందరపడి నిర్ణయాలు తీసుకోకుండా ఆలోచించి తీసుకోవడం మంచిది. ధన నష్టం జరిగే అవకాశం ఉంటుంది, ఖర్చు చేయకుండా ఉండటం మంచిది. తొందరగా ఎవరిని నమ్మి డబ్బులు ఇవ్వకండి. మీలో ఉన్న కోపాన్ని దూరంగా పెట్టడం మంచిది. వ్యసనాలకు దూరంగా ఉండండి. వాహన ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా చేయడం మంచిది, ప్రమాదాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. దైవ చింతన చేస్తారు. వ్యాపారస్తులకు స్వల్ప లాభాలు కలుగుతాయి.

 

కుంభరాశి జనవరి -14- గురువారం ఈరోజు రాశి ఫలాలు.ఈరోజు అనుకున్న పని పూర్తి !

ఈరోజు అనుకూలంగా ఉంటుంది. వ్యాపార లాభాలు కలుగుతాయి. దంపతులిద్దరూ అన్యోన్యంగా ఉంటారు. సమస్యలు తగ్గిపోతాయి. అందరితో సఖ్యతగా, సన్నిహితంగా ఉంటారు. అప్పుల బాధలు తీరిపోతాయి. ధనలాభం కలుగుతుంది. ఈరోజు శత్రువులు కూడా మిత్రులు అయ్యే అవకాశం ఉంటుంది. అనుకున్న పని పూర్తి చేస్తారు. ఈరోజు తక్కువగా మాట్లాడడం వల్ల గొడవలకు దూరంగా ఉంటారు. ఉద్యోగస్తులు ఆఫీసులలో ఉన్నతమైన హోదాను పొందుతారు. విద్యార్థులు కష్టపడి బాగా చదువుకుంటారు.

 

మీన రాశి జనవరి -14- గురువారం ఈరోజు రాశి ఫలాలు.ఈరోజు తోటి ఉద్యోగులతో విభేదాలు !

ఈరోజు కొంచెం కష్టంగా ఉంటుంది. ఈరోజు మీలో ఉన్న ధైర్యాన్ని మీరే పోగొట్టుకుంటారు. ఎదుటివారితో ఆలోచించి మాట్లాడక పోవడం వల్ల వివాదాలు పెరిగే అవకాశం ఉంటుంది. ఈరోజు కోపంగా ఉంది అయిన వారిని దూరం చేసుకొనే అవకాశం ఉంది. అనుకున్న పనులు అనుకున్న సమయంలో పూర్తి కాక వాయిదా పడే అవకాశం ఉంటుంది. వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్త, ఈ రోజు ప్రమాదాల ఏర్పడే అవకాశం ఉంటుంది. మీకు తెలవకుండా శత్రువులు ఉన్నారు  జాగ్రత్త.  ఉద్యోగస్తులకు ఆఫీసులో మీ తోటి ఉద్యోగులతో విభేదాలు వచ్చే అవకాశం ఉంది. విద్యార్థులు ఈరోజు చదువు మీద దృష్టి పెట్టడం మంచిది.

 

author avatar
Sree matha

Related posts

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Shruti Haasan: మ‌ళ్లీ లవ్ లో ఫెయిలైన శృతి హాసన్.. బాయ్‌ఫ్రెండ్ తో బ్రేక‌ప్ క‌న్ఫార్మ్!

kavya N

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

April 26: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 26 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju